యంగ్ హీరోపై కంగనా సంచలన వ్యాఖ్యలు

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశం అవుతూనే ఉంది. బాలీవుడ్ లో ఉన్న కొందరిని మాఫియాగా పేర్కొంటూ ఆమె చేస్తున్న విమర్శలు అన్ని ఇన్నీ కావు. ఆ మాఫియాలోని ఎవరికి అయినా మద్దతుగా మరెవ్వరు అయినా స్పందిస్తే కంగనా చాలా సీరియస్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రియా చక్రవర్తికి మద్దతుగా ఆయుష్మాన్ ఖురానా మాట్లాడాడు. రియాపై సానుభూతి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశాడు.

సుశాంత్ మృతి కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతుగా ఆయన మాట్లాడటంపై కంగనా సీరియస్ అయ్యింది. బాలీవుడ్ మాఫియాకు చెందిన ఆమెను ఎలా నువ్వు సమర్ధిస్తావు అంటూ కంగనా టీం ఆమెను ప్రశ్నించింది. చప్లాస్ ఆయుష్మాన్ అంటూ సంభోదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కంగనా అఫిషియల్ టీం కనుక ఆ వ్యాఖ్యలు ఆమెవిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆ ట్వీట్ లో బాలీవుడ్ మాఫియా నుండి నీకు మద్దతు కావాల్సి ఉందేమో అందుకే నీవు ఆమెపై సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నావు. ప్రయోజనం పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఆయుష్మాన్ ను ఉద్దేశించి కంగనా టీం వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కంగనా ఈమద్య కాలంలో మరీ రెచ్చి పోయి మాట్లాడుతోంది. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సుశాంత్ మృతికి బాలీవుడ్ వారు కారణం అంటూ ఆమె చేస్తున్న ఆరోపణలను చాలా మంది సమర్థిస్తున్నారు. ఈ సమయంలో కంగనా కరణ్ జోహార్ మహేష్ భట్ లతో పాటు మరికొందరిని కూడా టార్గెట్ చేసి బాలీవుడ్ మాఫియా అంటూ అభివర్ణిస్తోంది.