సంజయ్ దత్ డిశ్చార్జ్ అయ్యారు..కానీ అసలు సమస్య బయటపెట్టిన వైద్యులు..!!

0

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షలలో ప్రజలను ఓ వైపు మహమ్మారి బారిన పడేసి ఇబ్బందులు పెడుతుంటే.. మరోవైపు కరోనా వలన వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ మరణాల గురించి తట్టుకోలేక పోతుంటే.. మరోవైపు ఇండస్ట్రీలో కూడా వరుస సెలబ్రిటీల విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఏ సెలబ్రిటీ ఏ చిన్న సమస్యతో ఆసుపత్రిలో చేరినా కూడా వెంటనే భయపడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కరోనా వలన హాస్పిటల్ పాలవడం అందరికీ షాక్ ఇచ్చింది. వెంటనే ఆరోగ్యంగానే కనిపించిన సంజయ్ ఉన్నట్లుండి ఒక్కసారిగా ముంబై నగరంలోని లీలావతి హాస్పిటల్లో చేరాడు. కానీ కరోనా లేదంటూ ఒక్క రోజులోనే డిశ్చార్జ్ కూడా చేసారు వైద్యులు. డిశ్చార్జ్ చేశారు కానీ మరో షాక్ న్యూస్ వెల్లడించారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా సంజయ్ అనారోగ్యానికి ఎందుకు గురయ్యారని ఆరా తీస్తున్నారు అభిమానులు.

ఈ విషయం పై ప్రస్తుతం కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సంజయ్ దత్కి శ్వాస సంబంధ సమస్య వచ్చిందనే వార్త కాస్త కంగారు పెడుతుంది. అయితే కరోనా కూడా కాకపోవడంతో మరేంటి అనేది వైద్యులు టెస్ట్ చేసి తెలిపారట. సంజయ్ దత్ సన్నిహితులలో ఒకరు చెప్పిన దాన్ని బట్టి సంజయ్ దత్ కి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయినట్లు తెలుస్తుంది. ఆ సమస్యతోనే కొన్ని రోజులుగా బాధపడుతున్నాడట. ఇదే విషయం సంజయ్కు వైద్యులు కూడా తెలిపారట. అంతేకాదు ఆయన ఊపిరితిత్తుల నుంచి కొంత నీటిని కూడా బయటికి తీశారు. డాక్టర్ల పరిశీలనలో ఒకరోజు ఉన్న సంజయ్.. ఆగస్ట్ 10న డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాడు. అయితే లాక్డౌన్ ప్రారంభం నుండి సంజయ్ భార్య మన్యతతో పాటు పిల్లలు కూడా దుబాయ్లోనే ఉన్నారు. దాంతో ముంబైలో ఒక్కడే ఉన్నాడు సంజయ్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కెజియఫ్ -2 సినిమాలో విలన్ అధీరాగా నటిస్తున్నాడు సంజయ్. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రబృందం. ప్రస్తుతం ఆ ఫస్ట్ లుక్ కూడా ట్రెండింగ్ లో ఉంది.