యవ్వనం కోసం మసాజ్ పార్లర్ కి వెళ్లిన సీనియర్ నటి

0

ఒకప్పుడు అమృతం తాగిన దేవతలు నిత్య యవ్వనులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు? మనుషులకు కూడా అలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే బావుండేది. మానవమాత్రులు కూడా ఈ తరహాలో ట్రై చేశారని చందమామ బొమ్మరిల్లు కథల్లో చదువుకున్నాం కానీ.. ఇటీవల మోడ్రన్ బిజీ లైఫ్ లో ఒత్తిళ్లతో 30 ప్లస్ లోనే వృద్ధులు అవుతూ కలవరపెట్టడం చూస్తున్నాం.

కానీ బెబో కరీనా ప్రయత్నం చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంది. ఈ భామ యవ్వనం కోసం కొత్త రూట్ లో వెళుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా పార్లర్ లో మాలిష్ పాలిష్ అంటూ ఇదిగో ఇలా ప్రత్యక్షమైంది ఈ దేవతా సుందరి. అయినా 40 ప్లస్ ఏజ్ లో ఇంకేం యవ్వనం? ఎంత ట్రై చేసినా కాస్త పాలిష్ చేయగలరేమో కానీ మునుపటిలా ఇష్క్ తలాష్ అనిపించేలా అందం తిరిగి తేవడం కష్టమే.

జీరో సైజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన కరీనా ఉన్నట్టుండి ఏజ్ ప్రభావంతో డల్ అయిపోయింది. అందుకేనా ఈ ప్రయత్నం అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్. ఇటీవల కరీనా కపూర్ ఖాన్ ఇంట్లో తన సమయాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఆమె మళ్ళీ మాతృత్వాన్ని స్వీకరించడానికి సన్నద్ధమవ్వడమే ఇందుకు కారణం కావొచ్చు. ఇప్పటికే తైమూర్ కి జన్మనిచ్చిన బెబో ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయినా అందం విషయంలో తన శ్రద్ధ యువతరంలో చర్చకు వస్తోంది. ఇక కరీనా మాలిష్ పై సాటి నాయికల స్పందన ఆసక్తికరం. సో స్వీట్ అని మలైకా పొగిడేస్తే.. అమృతా అరోరా… కరిష్మా కపూర్ .. కరీనా కజిన్ రిద్దిమా కపూర్ సాహ్ని హార్ట్ ఎమోటికాన్ లను షేర్ చేశారు. కరీనా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా కరోనా వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.