రాజశేఖర్ హెల్త్ అప్ డేట్.. 80% క్యూర్

0

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ మరియు ఆయన కుటుంబం మొత్తం కూడా కరోనా బారిన పడ్డారు. పిల్లలు ఇద్దరు కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ నుండి నెగటివ్ కు వచ్చేశారు. జీవిత మాత్రం వారం నుండి పది రోజుల పాటు కాస్త ఇబ్బంది పడ్డారు. కాని రాజశేఖర్ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా కరోనా వల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. ఒకానొక సమయంలో ఆయన పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి మరీ చెప్పుకొచ్చారు. ఆయన ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో ఆయన పరిస్థితి నిలకడగా ఉందంటూ ప్రకటన వచ్చింది.

రాజశేఖర్ ఆరోగ్యం విషయమై జీవిత మాట్లాడుతూ… ఇన్ని రోజులు వెంటి లేటర్ ద్వారా శ్వాస అందించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ తొలగించడం జరిగింది. స్వతంత్ర్యంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. ఇన్ఫెక్షన్ కూడా దాదాపు 80 శాతం వరకు తగ్గిందని వైధ్యులు తెలియజేశారు. మరికొన్ని రోజుల్లోనే ఆయన ఐసీయూ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కరోనా నుండి ఇంకా ఆయన తేరుకోలేదా నెగటివ్ రిపోర్ట్ రాలేదా అనే చర్చ జరుగుతోంది. కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ విషయం పలువురి విషయంలో నిర్థారణ అయ్యింది. కనుక రాజశేఖర్ మరో రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండి పూర్తి ఆరోగ్యంగా బయటకు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.