ఎయిర్ పోర్ట్ లో PPE కిట్ తో కత్రిన హల్చల్

0

సేఫ్టీ ఫస్ట్ అంటూ పీపీఈ కిట్ లో ఇలా దిగిపోయింది.. ఇంతకీ ఎవరీ అమ్మడు? అంటే.. ఇంకెవరు.. ది గ్రేట్ కత్రిన కైఫ్. సురక్షితంగా మహమ్మారీ నుంచి దూరంగా ఉండడం చాలా చాలా ముఖ్యం అని చెప్పేందుకే కత్రిన ఇలా ముసుగు ధరించింది. పీపీఈ కిట్ లో కాస్త కష్టమే అయినా భరించింది.

కత్రినా కైఫ్ విమానాశ్రయంలో ఇలా దిగేసరికి ఒకటే హాట్ టాపిక్ గా మారింది. ఫేస్ షీల్డ్ ‘అవుట్ ఫిట్ చెడ్డది కాదు’ అంటూ కత్రిన గట్టిగానే చెప్పింది. ఇంతకీ కత్రిన ఎక్కడికి వెళ్లింది అంటే దానికి సరైన ఆన్సర్ లేదు. తల నుండి కాలి వరకు పూర్తి పిపిఇ కిట్ ధరించి మరీ ఇలా ప్రత్యక్షమైంది. ఆమె ముంబై విమానాశ్రయం నుండి ఫోటోను పోస్ట్ చేసింది.. కానీ ఆమె గమ్యాన్ని వెల్లడించలేదు.

ఈ ఫోటోకు ఆమె స్నేహితులు అభిమానుల నుండి అభినందనలు దక్కాయి. కథానాయిక హుమా ఖురేషి ఆమెను ‘బాంబ్’ అని వ్యాఖ్యానించగా… ఒక అభిమాని “లవ్లీ స్టే సేఫ్ క్వీన్ కత్రినా” అని రాశాడు. మరొక అభిమాని.. “దుస్తుల్లో చెడ్డది కాదు .. మీరు చెడ్డవారు కాదు.. అన్న వ్యాఖ్యను జోడించాడు.

కెరీర్ సంగతి చూస్తే… కత్రినా చిత్రం సూర్యవంశీ మార్చిలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. `ఫోన్ భూత్`లో సిద్ధాంత్ చతుర్వేది- ఇషాన్ ఖట్టర్ లతో కలిసి కనిపించనుంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ను తమ అభిమానులతో పంచుకునేందుకు ఈ ముగ్గురూ ఇన్ స్టాగ్రామ్ లో కి వెళ్లి 2021 లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో సినిమా చిత్రీకరణ సాగనుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో సోలో సూపర్ హీరో చిత్రం కూడా కత్రిన చేయాల్సి ఉంది.