ఇస్మార్ట్ రామ్ కి త్రివిక్రమ్ కథ..భైర్లు కమ్మే డీల్!!

0

స్టార్ డైరెక్టర్లు సొంత కథలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి మిరాకిల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ అయితే ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. సొంత కథ.. కథనం.. మాటలు సహా రచయితగా టోటల్ ప్యాకేజీని రెడీ చేసి తానే స్వయంగా దర్శకత్వం వహించి హిట్లు కొడుతున్నాడు.

త్రివిక్రమ్ ఒక కథను సెలెక్ట్ చేస్తే అది బంపర్ హిట్టు గ్యారెంటీ అన్న నమ్మకం హీరోలకు ఉంది. స్టార్ హీరోలు పవన్ కల్యాణ్.. మహేష్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ లతో మాత్రమే త్రివిక్రమ్ పని చేస్తున్నారు. నితిన్ లాంటి హీరోలకు రేర్ గా ఛాన్స్ దక్కుతోంది. ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ తో కూడా త్రివిక్రమ్ పని చేయనున్నారని గత కొంతకాలంగా కథనాలొస్తున్నాయి.

రామ్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ ఓ కథ రాస్తున్నాడట. ఈ కథ కోసం త్రివిక్రమ్ కి 10 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా అన్నది డౌట్ కానీ కథ స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ ఇస్తున్నారని సమాచారం. అయితే ఇది పక్కనపెడితే ఈ ప్రాజెక్ట్ ని 45 కోట్లతో తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. అయితే రామ్ పై ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది ఇప్పటి క్వశ్చన్. చివరిగా జులాయ్ టైప్ లో కథ కావాలని రామ్ త్రివిక్రమ్ ని కోరినట్లుగా తెలిసింది.