ఇంతకీ బోయ్ ఫ్రెండ్ ని పెళ్లాడేస్తోందా?

0

ఇటీవల కొంతకాలంగా అందాల యువనాయిక పూనమ్ బజ్వా సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో హీటెక్కిస్తున్న సంగతి తెలిసినదే. మునుపటితో పోలిస్తే ఈ అమ్మడు మరింతగా పాపులారిటీ పెంచుకుంటోంది. రెగ్యులర్ ఫోటోషూట్లు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

ఇక పూనమ్ హాట్ షోతో ఫ్లిర్టింగ్ సంగతి అటుంచితే మొన్ననే తన బోయ్ ఫ్రెండ్ ని పబ్లిక్ కి పరిచయం చేసింది. అతడితో ప్రేమాయణం విషయాన్ని ఓపెనప్ అయ్యింది. ప్రియుడు సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తమ మధ్య అనుబంధం కొనసాగుతున్నట్లు తెలిపింది. నా కలలకు రెక్కలు ఇచ్చిన వ్యక్తి.. జీవిత భాగస్వామి.. నా ఆనందం ఉత్సాహం నా సర్వస్వం నువ్వే. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్ ఓ మ్యాజిక్ లా ఉంటుంది. నిన్ను మాటల్లో చెప్పలేనంతంగా ప్రేమిస్తున్నాను“ అంటూ ప్రియుడి ని పరిచయం చేసింది. అన్నట్టు ఎలానూ ఆయనను పరిచయం చేసేసింది కాబట్టి కాజల్ లా పెళ్లాడేస్తుందా? అన్నది చూడాలి.

పూనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. నటన కంటే ఇప్పుడు తనకు నచ్చిన వారితో బాంధవ్యంపైనే దృష్టి సారించిందని అర్థమవుతోంది. పూనమ్ ఇప్పటికే తెలుగు తమిళం మలయాళంలో అగ్ర కథానాయకుల సరసన నటించింది. మోహన్ లాల్.. నాగార్జున వంటి స్టార్ల సినిమాల్లో నటించి మెప్పించింది.