ఆ ఇద్దరిలో చిరు చెల్లి కన్ఫర్మ్

0

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి కాకుండానే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఖైదీ నెం.150 సినిమా విడుదలైన వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్న చిరంజీవికి సైరా మరియు ఇతరత్ర కారణాల వల్ల సాధ్యం కాలేదు. కనుక వచ్చే ఏడాదిలో అయినా రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రెండు రీమేక్ లకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మూవీ పూర్తి అయిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాను రీమేక్ చేయబోతున్నాడు.

వేదాళం సినిమాలో హీరో చెల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్రను తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ తో చేయించే ప్రయత్నాలు జరిగాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండే సాయి పల్లవి మరియు కీర్తి సురేష్ లను ఈ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు వచ్చాయి. మొదట సాయి పల్లవి దాదాపుగా ఓకే అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె కాదు కీర్తి సురేష్ ఆ పాత్రకు ఎంపిక అయ్యిందని అంటున్నారు.

వీరిద్దరిలో కీర్తి సురేష్ ఓకే అయ్యిందనే వార్త మీడియా సర్కిల్స్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న కీర్తి సురేష్ చిరుకు చెల్లి పాత్రలో నటించడం కాస్త ఆసక్తికర విషయమే అంటున్నారు. ఈ వార్త అయినా నిజమేనా మళ్లీ చిరుకు కొత్త చెల్లి వస్తుందా అనేది చూడాలి. వచ్చే ఏడాది ఆరంభంలోనే వేదాళం రీమేక్ ను చిరు మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ ను కూడా చేయబోతున్నాడు. అందులో కూడా చిరు సోదరి పాత్ర ఉంటుంది. అయితే ఆ పాత్రకు సీనియర్ నటి కావాల్సి ఉంది.