దీక్ష విడిచిన పవన్.. నవంబర్ 1 నుండి యాక్షన్ షురూ

0

కరోనా లాక్ డౌన్ వల్ల అయిదు ఆరు నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ మళ్లీ షూటింగ్ లతో బిజీ అయ్యాడు. కాని కొందరు మాత్రం ఇప్పటి వరకు షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఏడు నెలలుగా పవన్ సినిమా షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు. పవన్ వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలోనే కరోనా లాక్ డౌన్ వచ్చింది. అప్పటి నుండి కూడా పవన్ షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలోనే పవన్ దీక్ష చేపట్టాడు. దీక్షలో భాగంగా గడ్డం మరియు జుట్టు పెంచాడు. గత కొన్ని నెలలుగా పవన్ ను గడ్డం మరియు జుట్టుతోనే చూస్తున్నాం. ఎట్టకేలకు దసరా సందర్బంగా పవన్ దీక్ష విరమించాడు.

పవన్ దీక్ష విరమించి మునుపటి లుక్ లోకి వచ్చేశాడు. గడ్డం మరియు జుట్టును ట్రిమ్ చేసిన పవన్ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో నవంబర్ 1 నుండి పాల్గొనబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్ది తేడాతోనే చక చక సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. ఇప్పటికే పవన్ అయిదు ఆరు సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటన్నింటిని కూడా వచ్చే ఏడాదిలోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

నవంబర్ 1 నుండి వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొని అదే నెలలో ఆ సినిమాను పూర్తి చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మూడు నెలల పాటు విరూపాక్ష సినిమాను చేయబోతున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ మూవీ ఉంటుంది. ఇక మలయాళ అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా పవన్ నటించబోతున్నాడు. ఆ సినిమా మరియు సురేందర్ రెడ్డి సినిమాలను కూడా పవన్ 2021 లో పూర్తి చేసేందుకు పట్టుదలతో ఉన్నాడట. మొత్తానికి 2021 మరియు 2022 సంవత్సరాల్లో పవన్ నుండి అయిదు ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.