అమ్మడి బోల్డ్ యాక్టింగ్ బాలీవుడ్ వరకేనా..?

0

కియారా అద్వానీ పేరు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి నోళ్ళలో నానుతుంది. ఎందుకంటే ఆమె ఎంచుకుంటున్న సినిమాలు అలాంటి పేరును తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతతో పాటు శృంగార సన్నివేశాలలో కూడా ఎక్కడా రాజీపడట్లేదు. అమ్మడు సినిమాలతోనే కాదు ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ఇదివరకే పచ్చని ఆకు చాటున టాప్ లెస్ పోజుతో పిచ్చెక్కించిన కియారా పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కియారాకు అలాంటి ఫోటోలు ప్రత్యేక గుర్తింపుతో పాటు లేని తంటాలు కూడా తెచ్చిపెడతాయి. అయితే ఒక నటి సోషల్ మీడియాలో ధైర్యంగా ఎక్స్పెరిమెంటల్ గా ఉండటం చాలా కష్టమంటూ వెల్లడించింది కియారా.

తాజాగా అమ్మడు తనకు ఇంటిమేట్ సన్నివేశాల వలనే ఇంత పాపులారిటీ వచ్చిందని.. ఇక పై కూడా శృంగార(ఇంటిమేట్) సన్నివేశాలలో నటించడానికి ఎలాంటి మొహమాటం లేదని అంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపంతా కియారా పైనే ఉండటంతో ఇదే సరైన సమయం అని ఇలా బోల్డ్ ప్రకటనలు ప్రకటిస్తుంది. ఇప్పటికే కబీర్ సింగ్.. లస్ట్ స్టోరీస్ లతో పాటు గిల్టీ వెబ్ సిరీస్ లో కూడా అలాంటి పాత్రే చేసింది. ఇక ఈ సినిమాలలో అమ్మడు పండించిన రొమాన్స్ చూసి ఫిదా అయినవారిలో స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ భామ తెలుగులో చేసిన రెండు సినిమాలలో ఎక్సపోసింగ్ లేకుండా డీసెంట్ పాత్రలే చేసింది. కానీ బాలీవుడ్ లో మాత్రం రొమాంటిక్ సీన్స్ తో రచ్చ చేస్తోంది. మరి అమ్మడి శృంగార సన్నివేశాల పరిధులు బాలీవుడ్ వరకేనా.. లేక టాలీవుడ్ లో కూడా బోల్డ్ పాత్రలలో మెరుస్తుందా..? చూడాలి. ప్రస్తుతం కియారా చేతిలో పలు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది.