Templates by BIGtheme NET
Home >> Cinema News >> బెల్లంకొండ బాలీవుడ్ ‘ఛత్రపతి’ లో మహేష్ హీరోయిన్..?

బెల్లంకొండ బాలీవుడ్ ‘ఛత్రపతి’ లో మహేష్ హీరోయిన్..?


టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 15ఏళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాని ఇప్పుడు సాయి శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో బెల్లంకొండ ని హీరోగా పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ .. ఇప్పుడు బాలీవుడ్ కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. వినాయక్ కి కూడా ఇది బాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ రీమేక్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో నటించే హీరోయిన్ అంటూ పలువురు ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి.

ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ నటించనుందని టాక్ వచ్చింది. ఇదే క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ని హిందీ ‘ఛత్రపతి’ లో తీసుకున్నట్లు బీ టౌన్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కియారా.. వెంటనే ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఈ మూవీ ప్లాప్ అవడంతో ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఈ క్రమంలో బెల్లంకొండ సరసన నటించడానికి ఒప్పుకుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ‘ఛత్రపతి’ ఒరిజినల్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ స్క్రిప్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి రోజులకు తగ్గట్టు తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.