కియరా ఇస్పీడు ఎక్కడా తగ్గదుగా!

0

డెబ్యూ రోజుల నుండి చూస్తే కియారా అద్వానీలో అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఓ వైపు అందాన్ని కాపాడుకుంటూ కెరీర్ ని పరుగులెత్తించడమెలా? అంటే…లోతైన వివరాల్లోకి వెళ్లాలి.

లస్ట్ స్టోరీస్ తో కియరా దశ దిశ తిరిగిపోగా.. ‘కబీర్ సింగ్’ లాంటి బాక్సాఫీస్ సంచలనం తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవల్ కి చేరుకుంది. ప్రస్తుతం ఈ భామ `ఇందూ కి జవానీ` అనే చిత్రంలో నటిస్తోంది. 28 ఏళ్ల యువతి జీవిత పయనంపై సినిమా ఇది. రోమ్-కామ్ లో ఇందూ గుప్తా అనే పాత్రను పోషిస్తోంది. ఇది ఘజియాబాద్ కు చెందిన ఒక వండర్ గాళ్ కథను ఆన్ లైన్ డేటింగ్ పర్యవసానాలపైనా తీసిన సినిమా.

ఇందూ ప్రతి యువ భారతీయ అమ్మాయిలో కనిపిస్తుంది అంటూ ఒకటే ప్రచారం షురూ చేశారు. ప్రేమిస్తుంది.. చమత్కరిస్తుంది.. బాంబ్ లా పేల్తుంది. ఈ మూవీ క్రాకింగ్ ఎంటర్ టైనర్ అవుతుంది అంటూ కియరా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. మూవీ నుండి తన ఫస్ట్ లుక్ విడుదలయ్యాక బోలెడన్ని కామెంట్లు వినిపించాయి. ఇక ఇందూ లుక్ ఇంత గ్లామరస్ గా ఉంటుందా? అనేంతగా తాజాగా ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఫోటోషూట్ హీట్ పెంచేస్తోంది. అవినాష్ గోవారికర్ .. లేఖ టీమ్ తనను ఇలా డిజైన్ చేశారని కియరా వెల్లడించింది. ఇక వైట్ అండ్ వైట్ లో థైషోస్ మరో సర్ ప్రైజ్ ట్రీట్.

ఇంతకుముందు కియరా ఓ వీడియోని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. అందమైన పూల ఆకృతులతో కియారా అద్వానీ లెహెంగా ఇటీవల వైరల్ గా మారింది. ఆదిత్య సీల్ తో కలిసి ‘హసీనా పాగల్ దీవానీ’ ట్యూన్స్ కు అప్రయత్నంగా డ్యాన్స్ చేస్తున్న కియరా అందం మైమరిపిస్తోంది.