త్రివిక్రమ్ తీరును తప్పుబట్టిన కోటి!?

0

సీనియర్ సంగీత దర్శకుడు.. ఒకప్పుడు గొప్ప సంగీత దర్శకుల్లో ఒక్కరు అయిన కోటి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. చిన్న చితకా సినిమాలకు సంగీతం చేసుకుంటూ బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ఏఆర్ రహమాన్ గతంలో తాము(రాజ్ కోటి) చేసిన మ్యూజిక్ ఆల్బం నుండి ట్యూన్స్ ఇన్సిపిరేషన్ అయ్యి పాటలు చేశాడు. రోజా సినిమాలోని నా చెలి రోజావే పాటను కూడా మా ట్యూన్ ను కాపీ చేశాడంటూ వ్యాఖ్యలు చేశాడు. గతంలో నా వద్ద చేసిన వ్యక్తి అంటూ గొప్పగా చెప్పుకుని పబ్లిసిటీ పొందిన కోటి ఇప్పుడు రహమాన్ పై విమర్శలు చేస్తూ పబ్లిసిటీ దక్కించుకోవాలని చూస్తున్నాడేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కోటి సినిమా పరిశ్రమపై కూడా కామెంట్స్ చేశాడు. పెద్ద హీరోల సినిమా ఆఫర్లు రాకపోవడంపై కాస్త వెటకారంగా స్పందించాడు. తాను ఇప్పటి వారికి తగ్గట్లుగా అప్ డేట్ అవ్వాలేమో. నాకు రావాల్సిన ఆఫర్లు మరెవ్వరైనా ఆపేస్తున్నారేమో. గతంలో త్రివిక్రమ్ సినిమాకు కూడా సంగీతాన్ని అందించిన తాను ఇప్పుడు వారికి పనికి రావడం లేదు అన్నాడు.

త్రివిక్రమ్ సినిమాకు మంచి పాటలు ఇచ్చాను. కాని మళ్లీ అతడు ఎప్పుడు కూడా తన సినిమాకు పాటలు ఇవ్వమని అడగలేదు. ఛాన్స్ ఇవ్వమని నేను కూడా అతడిని అడగలేదు. ఒకసారి మంచి పాటలు ఇచ్చినందుకు మళ్లీ కలిసి పని చేయాలని అతడికే ఉండాలి కదా అంటూ త్రివిక్రమ్ ను విమర్శించినట్లుగా కోటి ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.