మేఘా శారీలో సంథింగ్ హాట్

0

లైఫ్ లో టైమ్ రావాలని అంటారు. కాలం కలిసొస్తే నడిచొచ్చే పిల్లాడు పుడతాడని కూడా అంటారు. మరి మేఘ ఆకాష్ కి అలాంటి ఛాన్సుందా? అంటే.. ఏమో చెప్పలేం.

`లై` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ క్యూట్ బ్యూటీ. బొద్దుగా ముద్దుగా కవ్వించిన ఈ భామలోని స్పీడ్ యూత్ కి పిచ్చిగా నచ్చేసింది. ఆ క్రమంలోనే యూత్ స్టార్ నితిన్ ఈ ముద్దుగుమ్మకు పరేషాన్ అయ్యాడని కథనాలొచ్చాయి. అతడితోనే `చల్ మోహనరంగా` ఆఫర్ వరించగా మరింత డౌట్ పెట్టేశారు. అయితే ఇవేవీ సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత మేఘ తమిళ పరిశ్రమకు వెళ్లిపోయింది.

తమిళంలో అగ్ర హీరోల సరసన ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా గౌతమ్ మీనన్ తీసిన ఒక స్పెషల్ సాంగ్ వీడియో లో మేఘ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోలో మేఘా సాఫ్ట్ వేర్ ఇంజినీలా స్టైలిష్ గా కనిపిస్తోంది. శారీలో సంథింగ్ హాట్ గా కవ్వించేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇక మేఘా కెరీర్ సంగతి చూస్తే.. తమిళంలో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. బొద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవకాశాలే దక్కుతున్నాయి అక్కడ. బూమరాంగ్ – శాటిలైట్ శంకర్ (హిందీ)… ఎన్నయ్ నోకి పాయుమ్ తోట.. ఒరు పక్కా కథయ్.. యుధుమ్ ఊయిరే యావరమ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే `మను చరిత్ర` అనే తెలుగు చిత్రంలోనూ ఆఫర్ దక్కిందని ప్రచారం సాగినా దానిపై ఎలాంటి సమాచారం లేదు. సల్మాన్ భాయ్ రాధే లో చిన్నపాటి రోల్ లో ఆఫర్ దక్కించుకుందని ప్రచారమవుతోంది.