పంతం వీడని వైట్ల.. సొంతంగానే ‘ఢీ’ సీక్వెల్

0

మంచు విష్ణు సినీ కెరీర్ లో ‘ఢీ’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాను సీక్వెల్ చేయాలని చాలా కాలంగా విష్ణు కోరుకుంటున్నాడు. తన టీంతో కథలు రెడీ చేయించుకున్న విష్ణు చివరకు అనుకున్నట్లుగా సీక్వెల్ ను ప్రకటించాడు. కథ తయారు విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాద్ షా తర్వాత వైట్ల సొంతంగా రెడీ చేసుకున్న కథలు ఏవీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే కోన వెంకట్ తో వైట్ల విభేదాలు వచ్చాయో అప్పటి నుండి ఫ్లాప్ లు అవుతున్నాయి. ఢీ సీక్వెల్ కోసం వైట్ల కోరితే కలిసి పని చేసేందుకు తనుకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ప్రకటించిన కోన వెంకట్ ను సీక్వెల్ లోకి తీసుకోలేదని తాజాగా విడుదలైన టైటిల్ లోగో పోస్టర్ తో క్లారిటీ వచ్చింది.

కథ వైట్ల సొంతంగా రెడీ చేశాడా లేదంటే ఇతర రైటర్లతో కలిసి రాసుకున్నాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కాని కోనతో మాత్రం కలిసి ఈ కథ రెడీ చేయలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు బలంగా చెబుతున్నారు. కోన కలిసి వర్క్ చేసేందుకు ఓకే అన్నా కూడా వైట్ల ఎందుకు పంతం వీడటం లేదు అంటూ వీరిద్దరి కాంబో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీరిద్దరు కలిసి చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న గొడవలు చాలా సహజం. కాని వైట్ల మాత్రం వాటిని పట్టుకుని పంతం వీడటం లేదు అంటూ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.

ఢీ సీక్వెల్ డీ అండ్ డీ ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతుంది. రచయిత గోపీ మోహన్ మరియు వైట్లలు కలిసి పలు సినిమాలకు వర్క్ చేశారు. ఆ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు మళ్లీ కలిసి వర్క్ చేస్తున్నారు. కాని ఈసారి కోన లేడు. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.