హాలీవుడ్ స్టార్లతో ‘ప్రభాస్’కి ఓ బిల్డింగ్ ఉండాలి: సీనియర్ రెబల్ స్టార్

0

స్టార్ హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ గా నిలిచిపోయే అడుగు పెట్టబోతున్నాడని అందరూ అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో కృష్ణంరాజు ఆదిపురుష్ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పి థ్రిల్ ఇచ్చారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ అంటే విష్ణుమూర్తి.. ఆయన అవతారాల్లో ఆదిపురుష్ ఒకటి. సోసియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్తో విసువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించాలని చిత్రయూనిట్ సంకల్పించారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు.. వెంటనే బాగుంది ఖచ్చితంగా చేద్దాం అనేసాడు. అలాగే ఈ సినిమా కథ నేను కూడా విన్నాను. నాకు కూడా బాగా నచ్చింది. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇది కేవలం భారతీయ భాషల్లోనే కాదు.. హాలీవుడ్లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయోధ్య రామాలయానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఆ శ్రీరాముడి కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఆదిపురుష్ సబ్జెక్ట్ తెరపైకి రావడం గొప్ప విషయం. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే గొప్ప సినిమా అవుతుంది.

పురాణాలకు సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా ఉంటుంది. దాదాపు ఈ సినిమా వెయ్యి కోట్లు బడ్జెట్ ఉండబోతుంది. మన పురాణాలు ఇతిహాసాల గొప్పతనం ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రపంచానికి తెలియజెప్పబోతున్నాడు ప్రభాస్. ఇక “నా కోరిక ఏంటంటే.. బాహుబలి సినిమా చూసిన తరువాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అయితే బాహుబలి చిత్రంతోనే ఆ మార్క్ అందుకున్నాడు. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి వెళ్తాడు. అలాగే ప్రభాస్తో నా కోరిక చెప్పాను. నీతో కలిసి బ్లవర్లీ హిల్స్లో భోజనం చేయాలని.. బ్లవర్లీ హిల్స్లో భోజనం అంటే అక్కడ ఓన్లీ హాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకే అక్కడ ప్రభాస్తో కలిసి భోజనం చేయాలని ఉందని కోరాను. అందులో ప్రభాస్కి కూడా ఒక బిల్డింగ్ ఉండాలి.. నేను అక్కడ ప్రభాస్తో కలిసి భోజనం చేయాలి. త్వరలోనే ఆ కోరిక తీరబోతోందని అనుకుంటున్నా. ప్రభాస్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ తన కోరికను బయటపెట్టారు కృష్ణంరాజు. చూడాలి మరి పెదనాన్న కోరిక తీరుస్తాడో లేదో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.