లవర్స్ డే స్పెషల్: ఆయన పెదరాయుడు అయితే మరి అవిడా..!

0

వేలెంటైన్స్ డే సందర్భంగా పర్ఫెక్ట్ కపుల్ ని ఎంపిక చేయమని అడిగితే ఎలాంటి సందేహం లేకుండా నయనతార- విఘ్నేష్ జంటను ఎంపిక చేసే అభిమానులున్నారు. అంతగా ఆ జంట ఇటీవల పాపులరైంది. ఏజ్ పరంగా తనకంటే ఒక ఏడాది సీనియర్ అయిన నయనతారతో విఘ్నేష్ ప్రేమాయణం నిరంతరం హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్రేమికుల రోజును పురస్కరించుకుని నయనతారతో అద్భుతమైన ఫోటోను విఘ్నేష్ తాజాగా పంచుకున్నారు. తన ప్రియాతి ప్రియమైన ప్రేయసిని ఎల్లవేళలా ప్రేమించడం తనకు చాలా ఇష్టమని వ్యాఖ్యను జోడించాడు. ప్రతిసారీ సందర్భాన్ని బట్టి విఘ్నేష్ శివన్ తన లేడీ లవ్ నయనతారను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అతను ఆమెతో ప్రేమలో ఉండడాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడమే గాక.. తనను తంగమే అని ఎంతో ప్రేమగా పిలిచాడు. నానుమ్ రౌడీ ధాన్ లోని విజయవంతమైన పాటలలో ఒకటి తంగమే… ఈ మూవీ కోసం కలిసి పనిచేసినప్పుడు 2015 లో డేటింగ్ ప్రారంభించారు. ఆరు సంవత్సరాలుగా ఈ జంట ప్రేమాయణం సాగిస్తోంది. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా వేలెంటైన్స్ డే సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో విఘ్నేష్ లుక్ చూస్తుంటే ఎంతో పరిణతితో ఉన్న యువకుడిలా కనిపిస్తోంది. ఇక నయనతార మెచ్యూర్డ్ వ్యక్తిత్వానికి అది మ్యాచ్ అవుతోంది.

ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే విఘ్నేష్ శివన్ ఇప్పుడు కాతువాకుల రేండు కాదల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రోమ్-కామ్ లో నయనతార- విజయ్ సేతుపతి- సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి సింగిల్ రేండు కాదల్ ఈ రోజు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది.