రాధేశ్యామ్ టీజర్ గ్లింప్స్: వ్వాట్! ప్రేమ కోసం పడి చచ్చే టైప్ కాదన్నాడు!!

0

ప్రేమకోసం చచ్చేందుకైనా సిద్ధంగా ఉండేవాడే అసలైన ప్రేమికుడు! కానీ రాధేశ్యామ్ ఏమిటీ ఇలా అనేసాడు? నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? అంటూ తన వెంటపడేవాడిని అడిగేస్తోంది ప్రేరణ (పూజాహెగ్డే).

దానికి అతడి సమాధానం అంతే ఇంట్రెస్టింగ్. “ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేనా టైప్ కాదు!!“ అంటూ డార్లింగ్ ప్రేరణ కళ్లలోకి చూస్తూ ప్రేమగా ఎంత ఇదిగా చెప్పాడు? చూస్తుంటే ప్రేరణ లేకుండా జీవించేట్టు లేడు పాపం పసోడు! .. ఇదీ రాధేశ్యామ్ వేలెంటైన్స్ డే టీజర్ గ్లింప్స్.

వ్వావ్ అనిపించే బ్యూటీతో టీజర్ ఆద్యంతం ఎంతో ప్లెజెంట్ గా ఆకట్టుకుంది. రాధేశ్యామ్ ప్రభాస్ అభిమానులకు మరపు రాని ట్రీట్ కానుందని అర్థమవుతోంది. బాహుబలి లో వీరుడిగా కనిపించిన ప్రభాస్.. సాహోలో యాక్షన్ కే బాప్ అనిపించాడు. ఇప్పుడు ప్రేమికుడిగా కూడా ఎక్స్ ట్రీమ్ అంటే ఏమిటో చూపించేయబోతున్నాడని దీనిని బట్టి అర్థమవుతోంది. యూరప్ అందచందాల్ని తెరపై అంతే మంత్రముగ్ధంగా చూపించబోతున్నారని కూడా రాధేశ్యామ్ టీజర్ చెబుతోంది. ఇక పూజా హెగ్డే అందం నటన మరో అస్సెట్ కానుంది.

మునుముందు ట్రైలర్ కూడా వచ్చేస్తే మరింత ఖుషీ అయిపోతారు డైహార్డ్ ఫ్యాన్స్. జూలై 30న రిలీజ్ చేస్తున్నామని టీజర్ లో కూడా ఖాయం చేసేయడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్.