అవాక్కయిన లావణ్య వెంటనే తన ఫీలింగ్ ని బయట పెట్టేసి..!

0

ఉన్నట్టుండి యంగ్ హీరో సందీప్ కిషన్ మ్యాచో మ్యాన్ గా మారిపోయాడు. కండలు మెలితిప్పి సిక్స్ ప్యాక్ లుక్ లో ఫ్లంట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ యంగ్ తరంగ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న `ఏ1 ఎక్స్ ప్రెస్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిపోయాడు.

సందీప్ లుక్ పై హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాట్ కామెంట్ చేసింది. సందీప్ ట్రాన్స్ ఫార్మేషన్ ని చూసి ఒక్కసారిగా అవాక్కయిన లావణ్య వెంటనే తన ఫీలింగ్ ని బయట పెట్టేసింది. `ఏ 1 ఎక్స్ ప్రెస్` మూవీలో సందీప్ తో కలిసి నటించడం చాలా సరదాగా అనిపించింది. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేశా` అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది.

లాక్ డౌన్ బిఫోర్ ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ మొత్తం పూర్తయింది. కరోనా కారణంగా ఈ మూవీ చిత్రీకరణ ఆగిపోయింది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ మూవీ కోసం భారీ క్లైమాక్స్ ని ప్లాన్ చేసినట్టు తెలిసింది