క్యాన్సర్ తో సంజయ్ దత్ లో ఎంత మార్పు

0

సంజయ్ దత్ పేరు చెప్పగానే చాలా మందికి కళ్ల ముందు ఒక రఫ్ లుక్ ప్రత్యక్షం అవుతుంది. ఒక బ్యాడ్ బాయ్ థీమ్ తో చాలా మంది ఆయన్ను ఊహించుకుంటారు. జట్టు గడ్డం సీరియస్ లుక్ తో సంజయ్ దత్ ను ఇప్పటి వరకు ఊహించుకున్నాం. ఆయన ఎక్కువ సినిమాల్లో మరియు బయట కూడా అలాగే కనిపించాడు. కాని ఇప్పుడు ఆయన క్యాన్సర్ తో బాధపడ్తున్నారు. ఆ కారణంగా ఆయన వెయిట్ చాలా తగ్గినట్లుగా అనిపిస్తున్నాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అత్యంత కఠినంగా ఉంటుందనే విషయం తెల్సిందే. ఆ సమయంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు సంజు భాయ్ ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

ఇటీవల సంజయ్ దత్ దుబాయిలో పిల్లలతో కలిసి ఇలా ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫొటోలో సంజయ్ దత్ ను చూసిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింగ్ లా ఉండే సంజయ్ దత్ ఎలా మారిపోయాడు అంటూ కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సంజయ్ దత్ క్లీన్ షేవ్.. జట్టు కటింగ్ తో ఇలా చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే కనిపించాడు. ఇప్పుడు క్యాన్సర్ చికిత్స కారణంగా ఇలాంటి పరిస్థితిలో కనిపిస్తున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్నా కూడా తాను కమిట్ అయిన సినిమాలను మద్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే సంజు భాయ్ క్యాన్సర్ ను జయించాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు.