Templates by BIGtheme NET
Home >> Cinema News >> రష్మికకు జరిగినట్లే వాళ్ళకు కూడా..

రష్మికకు జరిగినట్లే వాళ్ళకు కూడా..


ఒకవైపు టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్నారు అని ఆనందపడాలో లేక మరొకవైపు అదే టెక్నాలజీ కారణంగా యువత చెడిపోతుంది అని బాధపడాలో అర్థం కావడం లేదు చాలా మంది ప్రముఖులు ఇటీవల కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో ఎంతగా ఆశ్చర్యాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆమె ఎలివేటర్‌లోకి వెళ్తున్నట్లు షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. కానీ అందులో ఉన్నది ఆమె కాదు. బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో రష్మికగా మార్చి వైరల్ చేశారు. ఇక ఆ విషయంపై చాలామంది సినీ ప్రముఖులు కూడా రష్మికకు మద్దతుగా నిలిచి ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా అన్నారు.

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది సినిమా సెలబ్రెటీలు రష్మీకకు సపోర్ట్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ గా ఆలోచించి ఇలాంటి వీడియోలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని చెప్పగా.. జైలు శిక్ష కూడా విధిస్తామని న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. అయితే కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ టెక్నాలజీతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అదే విషయంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తెలియజేశారు. యాప్స్ ద్వారా లోన్లు తీసుకున్న మహిళలను తిరిగి డబ్బు వసూలు చేసేందుకు ఈ విధమైన టెక్నాలజీని వాడుకుని వేధిస్తున్నారు అని ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆమె వివరణ ఇచ్చారు. చాలామంది అమాయకులు ఇలాంటి మోసాలకు నరకయాతన అనుభవిస్తున్నారు, లోన్స్ తిరిగి కట్టాలి అని ఏజెంట్స్ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసి బెదిరిస్తూ ఉన్నారు.

అయితే ఈ తరహా ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలి అలాగే డీప్ ఫేక్ వంటి టెక్నాలజీ విషయంలో అందరికీ ఒక అవగాహన వచ్చేలా చేయాలని అన్నారు. అలాగే బాలికలకు ఇలాంటి టెక్నాలజీ బారిన పడకుండా వారిలో చైతన్యం కల్పించే బాధ్యత కూడా అందరిలో ఉదయనే చిన్మయి తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)