ఇండస్ట్రీకి మహేష్ భట్ పెద్ద డాన్..నన్ను కూడా వేధించాడు: బాలీవుడ్ నటి

0

ఇటీవల బాలీవుడ్ లో జరుగుతున్న చాలా వ్యవహారాలను వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ మరణం తర్వాత నెపోటిజం – ఫేవరిజమ్ వంటి వాటిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అదే క్రమంలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. అలానే హీరోయిన్ పాయల్ ఘోష్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనని లైంగిక వేధింపులకు గురిచేసాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ నటి లువియానా లోధ్.. దర్శకనిర్మాత మహేష్ భట్ తనని వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు చేసింది. మహేష్ భట్ దగ్గరి బంధువైన సుమిత్ సబర్వాల్ ను వివాహం చేసుకున్న లువియానా లోధ్ ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే మహేశ్ భట్ నుంచి తనకి ప్రమాదం ఉందని పలు ఆరోపణలు చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది లువియానా.

లువియానా లోధ్ ఈ వీడియోలో మాట్లాడుతూ ”మహేష్ భట్ బంధువు సుమిత్ సబర్వాల్ ను కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్లకు సుమిత్ డ్రగ్స్ సరఫరా చేస్తాడనే విషయం తెలియడంతో ఇటీవల విడాకుల కోసం కోర్టుకు వెళ్ళాను. ఈ విషయాలన్నీ మహేశ్ భట్ కి కూడా తెలుసు. ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద డాన్. పరిశ్రమకు చెందిన ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పినట్లు వినకపోతే.. ఎదుటివారి జీవితాలను కష్టాల్లోకి పడేస్తాడు. అలా చాలామందికి పని లేకుండా చేసి వారి జీవితాలను నాశనం చేశాడు. ఆయన ఒక్క ఫోన్ చేస్తే చాలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇంటి నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టాలని చూశాడని ఆయనపై గతంలో వేధింపుల కేసు పెట్టాను. కానీ పోలీసులు పట్టించుకోలేదు. నాతో పాటు నా ఫ్యామిలీ భద్రత కోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నా ఫ్యామిలీకి నాకు ఏదైనా జరగరానిది జరిగితే దానికి కారణం మహేష్ భట్ – ముఖేష్ భట్ – సుమిత్ సబర్వాల్ – సాహెల్ సెహగల్ – కుంకుమ్ సెహగల్” అని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on