నీటిలో దిగి కాక రేపుతున్న బ్యూటీ

0

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ పేరు ఈమద్య కాలంలో సౌత్ లో తెగ వినిపిస్తుంది. అందంతో పాటు అభినయం విషయంలో కూడా ఆమె మంచి గుర్తింపు దక్కించుకుంది. మలయాళం తమిళం చిత్రాలతో పాటు హిందీ చిత్రంలో కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు తెలుగులో విజయ్ దేవరకొండ చిత్రంలో నటించేందుకు ఎంపిక అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కింది. ఆ సినిమా కాకున్నా త్వరలోనే మరో సినిమాతో అయినా ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడి హాట్ ఫొటోలు రెగ్యులర్ గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడి ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా సమయంలో స్టార్స్ ఎవరు కనీసం బయట అడుగు పెట్టేందుకు ధైర్యం చేయడం లేదు అలాంటిది ఈ అమ్మడు ఏకంగా అందమైన పకృతిలో జలకాలు ఆడుతోంది. బికినీలో ఉన్న ఈ అమ్మడు తాను నీటిలో ఉండి కూడా కాక రేపుతోంది.

తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఈమె నటించిన మాస్టర్ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. విజయ్ కు జోడీగా నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు అతి త్వరలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ అమ్మడి హాట్ ఫొటోలు ఆమెపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి.