ఇండియా పారా స్పోర్ట్ నిధి సేకరణకు మంచు మనోజ్ సపోర్ట్

0

క్రీడలంటే అమితాసక్తి ఉన్న స్టార్లలో విక్టరీ వెంకటేష్ .. నాగార్జున.. రాజమౌళి.. శ్రీకాంత్.. నాగచైతన్య.. రానా .. తరుణ్ .. ఇలా కొన్ని పేర్లు అందరికీ తెలుసు. ఇక వీలున్నప్పుడల్లా మంచు ఫ్యామిలీ హీరోలు స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యతనివ్వడం తెలిసినదే.

ఇప్పుడు భారత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రారంభించిన పారా స్పోర్ట్ కోసం నిధిని సేకరిస్తుంటే అందుకు అవసరమైన ప్రచారాన్ని కల్పిస్తూ మంచు మనోజ్ తనదైన శైలిలో దేశభక్తిని చాటుకున్నారు.

“నేను నిద్రపోయే ముందు మైళ్ళు ప్రయాణించాలి. 35 నగరాలు.. 41 రోజులు- తాజా ప్రతిభావంతుల కోసం 3800 కిలోమీటర్లు.. నిధులు సేకరించడం .. పారాస్పోర్ట్ పై అవగాహన కల్పించడం మా విధి“ అంటూ శ్రీనగర్.. దాల్ లేక్ నుండి శ్రీ రాకేశ్ అస్థానా (ఐపిఎస్ డిజి బిఎస్ఎఫ్) పోస్ట్ చేశారు. BSF ఇండియా # K2K రైడ్ ప్రారంభమవుతోందని తెలిపారు. మనోజ్ సొంతంగా ఎంఎం ఆర్ట్స్ ప్రారంభించి సినిమాని నిర్మిస్తూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రిలీజ్ చేసిన `అహం బ్రహ్మస్మి` లుక్ వైరల్ అయ్యింది.