విఘ్నవినాయకునితో అంజనీపుత్రుల ఇంట్రెస్టింగ్ డీల్

0

మెగాబ్రదర్స్ ని అంజనీపుత్రులు అని ఎందుకు అంటారో ఇప్పుడర్థమైంది. అమ్మ అంజనాదేవి సుపుత్రులు గనుక….!! అంజనాదేవి వారసులు మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన పనే లేదు. అన్నయ్య అంటే తమ్ముడికి ఎంతో గౌరవం. అంతకుమించి ప్రేమాభిమానాలు. ఎంతో ఎమోషనల్ గా ఉండే ఆ తమ్ముడు అంటే ఆ అన్నకు అంతే పంచ ప్రాణాలు. అలాగే వదిన సురేఖ తనకు పునర్జన్మనిచ్చిన తల్లిగా గౌరవిస్తారు పవన్ కల్యాణ్. మెగా ఫ్యామిలీలో ఎమోషన్స్ గురించి అభిమానులు నిరంతరం మాట్లాడుకునేవే ఇవన్నీ.

ఇంతకీ అంజనీపుత్రుల గురించి ఈ వినాయక చవితికే ఎందుకిలా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది? అంటే.. ఆ ఇద్దరూ కలిసి వినాయకునితో డీల్ మాట్లాడుకున్నారు. ఏమిటా డీల్ అంటే? పుట్టినరోజునే వినాయక చవితి కావాలి అని అడిగారట. అందుకే.. 2019లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)న వినాయక చవితి రాగా.. 2020లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22)న వినాయక చవితి డిక్లేర్ అయ్యింది.

ఏదేమైనా ఇదంతా యాధృచ్ఛికమే అయినా మెగా బ్రదర్స్ కు భలేగా కలిసొచ్చిందిగా! అంటూ అభిమానులు ఒకటే ఖుషీ అయిపోతున్నారు. మొత్తానికి విఘ్నవినాయకునితో బ్రదర్స్ డీల్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఏడాది బర్త్ డే వేడుకల పేరుతో మెగా బ్రదర్స్ చిరు-పవన్ తమ సినిమాల ఫస్ట్ లుక్ లతో అలరించనున్నారు. ఆగస్టు 22 బర్త్ డే రోజున చిరు నటిస్తున్న ఆచార్య మోషన్ టీజర్ రిలీజవుతుండగా.. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డేకి వకీల్ సాబ్ కొత్త లుక్ టీజర్ రిలీజ్ కానుంది.