ప్రభాస్ తలదన్నేవాడొచ్చేదెపుడు?

0

సాహో తర్వాత రకరకాల కారణాలతో బిగ్ గ్యాప్ వచ్చింది డార్లింగుకి. కానీ ఇప్పుడు స్పీడ్ చూస్తుంటే బాప్ రే ప్రభాస్! అంటూ ఆశ్చర్యంతో నోటిపై వేలేసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు కమిటైపోవడం చూస్తుంటే ప్రభాస్ ఇస్పీడ్ కి అడ్డుకట్ట వేసేవాడే లేడా? అంటూ షాక్ తింటున్నారు. రామ్ చరణ్ .. మహేష్.. తారక్.. బన్ని లాంటి టాప్ స్టార్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో బాహుబలి స్టార్ గా తన స్టామినా వేరు అని ప్రూవ్ చేస్తున్నాడన్న వ్యాఖ్యలు కామన్ జనాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ వినిపిస్తున్నాయి.

సైలెంటుగా సందు చూసి సైడ్ కోసేస్తుండు! టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దేసినట్టు కాంపిటీషన్ లో ఎవరూ మిగలకుండా చేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటిగా పాన్ ఇండియా .. పాన్ వరల్డ్ అంటూ హీట్ పెంచేస్తున్నాడు. ఏకంగా మూడు సినిమాలకు 300 కోట్లు సుమారుగా దండుకుంటున్నాడన్న చర్చా వేడెక్కిస్తోంది.

ఆదిపురుష్ ప్రాజెక్టుని ప్రకటించగానే మరోసారి ప్రభాస్ పేరు అటు బాలీవుడ్ లోనూ మార్మోగుతోంది. అక్కడ వరుసగా సినిమాలు చేసే అక్షయ్ కుమార్ లాంటి హీరోనే డామినేట్ చేస్తున్నాడు మన రెబల్ స్టార్. ఇక రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ 21.. ఆదిపురుష్ గ్రాండ్ సక్సెసైతే అతడి స్థాయిని అందుకోవడం వేరొక తెలుగు హీరో వల్ల కాదు అన్న చర్చా సాగుతోంది. ఎందరో ప్రతిభావంతులైన స్టార్లు మనకు ఉన్నా కానీ ప్రభాస్ అంత ఇస్పీడ్ చూపించిందేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అదంతా సరే కానీ.. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ 3డితో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో కిడ్స్ లో ఫాలోయింగ్ పెరుగుతుందన్న అంచనా వెలువడింది. ఇన్నాళ్లు ప్రభాస్ కి సౌత్ లో చిన్నారుల్లో వీరాభిమానులు ఉన్నా.. హిందీ రాష్ట్రాల్లో కిడ్స్ కి ఏమంత చేరువ కాలేదు. ఆదిపురుష్ కథాంశం రామాయణ ఇతిహాసం నేపథ్యం కాబట్టి వానరసేన విన్యాసాలు పిల్లలకు నచ్చుతాయని విశ్లేషిస్తున్నారు. అదే నిజమైతే.. హిందీ బెల్టులో కిడ్స్ లో ఇప్పటి జనరేషన్ కూడా ప్రభాస్ కి వీరాభిమానులు అయిపోతారు. ఇది అతడి మార్కెట్ రేంజును పెంచేందుకు మరింతగా దోహదపడుతుందనడంలో సందేహమేం లేదు. రైట్ టైమ్ లో సరైన ఎంపికలు ఎలా ఉండాలో డార్లింగ్ ప్రభాస్ చూపిస్తున్నాడు. మరి దీనిని ఇతర హీరోలు ఫాలో అవుతారా? అన్నది చూడాలి.