యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

జగన్ తో చిరు కటీఫ్.. పవన్ కు సపోర్ట్? అల్లు అర్జున్‌ని సైతం మెగా ఫ్యాన్స్ తిరస్కరించారా?

0

Mega Fans Unity: అభిమానులే సినీ హీరోలకు నిజమైన ఆరాధకులు.. వారే అనుంగ అనుచరులు అన్నట్టుగా మెదులుతారు. అభిమానులు నిజంగా తమ హీరోల మాటలు విని పాటిస్తారా? నటీనటులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి ఫాలో అవుతారా? పబ్లిక్ మీటింగ్‌లలో సినీ తారలను చూసి పిచ్చిగా అభిమానించే తారలు వారి కోసం తమ భేషజాలు అన్నీ విడిచి ఏకమవుతారా? అన్నది ఇన్నాళ్లు అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడది సాధ్యమైంది.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు దీన్ని చేసి చూపించారు. మనకున్న సందేహాలన్నీ తీర్చారు. విజయవాడలో మెగా అభిమానుల మధ్య సమావేశం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఏకతాటిపైకి వచ్చి కృషి చేస్తామని ఎజెండాగా నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది.

ఈ మెగా ఫ్యాన్స్ ఐక్యత సమావేశంలో బ్యానర్‌పై మెగా హీరోల చిత్రాలు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లవి ముద్రించి ఉండడం విశేషం. ఆలిండియా చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించారు. స్వామి నాయుడు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా అభిమానులు అంతా కృషి చేస్తారని ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఈ భేటీ గురించి చిరంజీవికి నిజంగా తెలుసా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే టిక్కెట్‌ ధరలు పెంచేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ చిరంజీవి ఎన్నో ప్రదక్షిణలు చేశారు. పవన్ కళ్యాణ్ కు దూరంగా జగన్ కు స్నేహితుడిగా ఉంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన తన సోదరుడు పవన్ పార్టీ జనసేనకు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు తన అన్నయ్య టిక్కెట్టు ధరలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లడం తనకు ఇష్టం లేదని పరోక్షంగా పవన్ కళ్యాణ్ రెండు సమావేశాల్లో చిరంజీవి తీరును కూడా తప్పుపట్టారు..

వీటన్నింటిని పరిశీలిస్తే.. మెగా అభిమానులు ఒక్కటై జనసేనకు సపోర్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కు మద్దతుగా నిలిచారా? అందుకే మెగా ఫ్యాన్స్ ను ఏకతాటిపైకి తెచ్చారా? జగన్ తో వైరానికే సిద్ధమయ్యారా? అన్న చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే అంతగా బతిమిలాడించుకొని మరీ జగన్ పెద్దగా టాలీవుడ్ కు చేసిందేమీ లేదన్న చర్చ సాగుతోంది. ఈక్రమంలోనే చిరంజీవి ఇప్పుడు తన ఫ్యాన్స్ మద్దతును ముందుగా పవన్ కు అందజేసి ఎన్నికల వరకూ తను సపోర్టు చేస్తాడు కావచ్చని ప్రచారం సాగుతోంది.

ఈ మెగా ఫ్యాన్స్ మీటింగ్ లో ట్విస్ట్ ఏంటంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ.. ఆయన ఫొటోలు కానీ బ్యానర్‌లలో కనిపించలేదు. దీంతో మెగా అభిమానులు అఫీషియల్‌గా ఆయన్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. పవన్ పై ఇదివరకూ నోరుపారేసుకున్న బన్నీని తమతో కలుపుకోకూడదని వీరంతా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.