హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ స్పందన

0

సీనియర్ హీరో రాజశేఖర్ కోవిడ్ 19 కి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె శివాత్మిక తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని చెప్పడంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కోవిడ్ తో నాన్న పోరాటం చాలా కష్టంగా మారింది. మీ ప్రార్థనల ప్రేమ మమ్మల్ని రక్షిస్తాయని ఆశిస్తున్నాను! అనడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే ఆ తర్వాత రాజశేఖర్ ఆరోగ్యంపై ఇతర కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించడంతో కొంత క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఆస్పత్రి వర్గాలు సహా జీవిత స్పందిస్తూ రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తప్పుడు వదంతులు సృష్టించవద్దని కోరారు.

తాజాగా రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న మరియు నా సహా నటుడు.. నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాము. ధైర్యంగా ఉండు..“ అని మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ప్రస్తుతం ఐసీయులో చికిత్స కొనసాగుతోంది. రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందన్న సమాచారాన్ని అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఎలాంటి కంగారూ లేదు. మూవీ ఆర్టిస్టుల సంఘం లో సభ్యులు కొలీగ్స్ కూడా రాజశేఖర్ ఆరోగ్యం మెరుగవ్వాలని దేవుని ప్రార్థనలు చేస్తున్నట్టుగా తెలిపారు.