Templates by BIGtheme NET
Home >> Cinema News >> చిరు ‘వేదాళం’లో బిగ్ బాస్ కంటిస్టెంట్.. మెగాస్టార్ ప్రకటన..

చిరు ‘వేదాళం’లో బిగ్ బాస్ కంటిస్టెంట్.. మెగాస్టార్ ప్రకటన..


బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే ప్రతీ కంటిస్టెంట్ రెండు లక్ష్యాలతో ఉంటారు. టైటిల్ దక్కించుకోవడం ఒకటైతే.. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకోవడం మరోటి. అయితే.. టైటిల్ ఎవరో ఒక్కరే దక్కించుకుంటారు. కానీ.. పాపులారిటీ డ్రా చేసే అవకాశం అందరికీ ఉంటుంది. ఆ ఫేమ్ ను తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఉపయోగించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. వీరిలో కొందరి ఆశలు ఫలిస్తుంటాయి కూడా..

తాజాగా ముగిసిన బిగ్ బాస్ 4 సీజన్ కంటిస్టెంట్ దివి వధ్య ఊహించని అవకాశం దక్కించున్నాారని సమాచారం. ఈమె ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 4 సీజన్ గ్రాండ్ ఫినాలే కు మెగాస్టార్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా తనదైన వాక్చాతుర్యానికి తగిన హాస్యాన్ని జోడించి కార్యక్రమంలో నవ్వులు పూయించారు. బిగ్ బాస్ కంటిస్టెంట్ల ఆటను రివ్యూ చేసిన ఈ టాలీవుడ్ బిగ్ బాస్.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే దివి సినిమా ఛాన్స్ గురించి చెప్పారు.

తన అప్ కమింగ్ మూవీ ‘వేదాళం’ రీమేక్లో అవకాశం గురించి దర్శకుడితో చర్చించినట్టు చిరు చెప్పాారు. ఈ ప్రకటన నేపథ్యంలో.. ఆ చిత్రంలో దివి కీలక పాత్ర పోషించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఆమెను పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈ వేదాళం రీమేక్కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు.

కాాగా.. దివి మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’లో ఓ చిన్న పాత్రలో నటించింది. అయితే.. ఇప్పుడు ఏకంగా చిరంజీవి చిత్రంలో నటించనుందనే వార్తల నేపథ్యంలో ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే.. పలు ప్రాజెక్టుల కోసం దివితో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి చిరు చిత్రంలో దివి నటించబోయేది వాస్తవమేనా..? బిగ్ బాస్ షో.. ఆమె సినీ కెరీర్ కు ఎలాంటి హెల్ప్ అవుతుందనేది రాబోయే రోజుల్లో చూడాలి. “