Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్

మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్


సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామం సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆమె పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఆమెని తమ కలల రాకుమారిగా చూస్తున్నారు. అలాంటి ప్రియురాలు తమకి ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. అంతలా తన పెర్ఫార్మెన్స్ తో పాటు అందంతో మృణాల్ ఠాకూర్ కట్టిపడేసింది. సీతారామం తర్వాత నానికి జోడీగా తెలుగులో తన నెక్స్ట్ సినిమాకి మృణాల్ ఠాకూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సీతారామం సినిమాలో ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో క్లాసికల్ గా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఫుల్ మోడరన్ గర్ల్ అని చాలా మందికి తెలియదు. హిందీ సీరియల్స్ తో సైడ్ పాత్రలతో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ మరాఠీ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది. తరువాత హిందీలో లవ్ సోనియా మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక 2018లో హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన బయోపిక్ మూవీ సూపర్ 30 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యింది.

ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా హీరోయిన్ గా అవకాశాలని సొంతం చేసుకుంటూ బాలీవుడ్ లో దూసుకుపోయింది. ఇక జెర్సీ రీమేక్ గా తెరకెక్కిన హిందీ జెర్సీలో షాహిద్ కపూర్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. చాలా వరకు హిందీలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనే మృణాల్ మెప్పించింది. ఇక సీతారామం సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. హిందీలో ఆమె నటించిన 5 సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక తెలుగులో నాని 30వ సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యింది.

ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ సినిమాలో కాస్తా పద్దతైన పాత్రలలో కనిపించిన బయట మాత్రం ఎక్కువ మోడరన్ హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. తాజాగా ఫ్లవర్ గౌన్ లో క్లీవేజ్ అందాలతో తీసుకున్న ఫోటోలు కుర్రాళ్ళని పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పాలి. స్వర్గం నుంచి దిగి వచ్చిన ఏంజెల్ లా ఆ కాస్ట్యూమ్స్ లో మృణాల్ ఠాకూర్ మెరిసిపోతుంది. కళ్ళలో హాట్ లుక్స్ ఆమె అందాన్ని మరింత ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి.