ట్రెండ్ అవుతున్న ఋషి వనంలో.. మెలోడీ సాంగ్..

0

స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా శాకుంతలం (Shaakuntalam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. వరుస అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

రీసెంట్ గా శాకుంతలం ట్రైలర్ (Shaakuntalam Trailer) రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్.. ఇప్పుడు ”ఋషి వనంలోన స్వర్గధామం .. హిమవనంలోన అగ్నివర్షం..” అంటూ సాగిపోయే అద్భుతమైన మెలోడీ సాంగ్ వదిలారు. శకుంతల, దుశ్యంతల ప్రణయానికి సంబంధించిన నేపథ్యంలో ఈ సాంగ్ షూట్ చేశారు. ఇందులో సమంత లుక్, లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. చిన్మయి శ్రీపాద (Chinmayi), సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఆలపించారు. మణిశర్మ (Mani Sharma) బాణీలు కట్టారు.

ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సమంత కెరీర్ లో వస్తున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. నీలిమ గుణ, దిల్ రాజు (Dil Raju) నిర్మాతలుగా శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా ఈ సినిమాతో మొదటిసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, గౌత‌మి, మ‌ధుబాల‌, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో మోహ‌న్ బాబు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని ట్రైలర్ ద్వారా అర్థమైంది. సమంత కెరీర్‌లో డిఫరెంట్ జానర్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.