హైదరాబాద్​లో భారీ సముద్రం.. ఎక్కడో తెలుసా

0

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తీస్తున్న చిత్రం ఉంది. షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం నుంచి స్పష్టత వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనుండగా ఈ చిత్రంపై అయితే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అనూహ్యంగా ఈ కొత్త ఏడాది మొదటి రోజే మాసివ్ అప్డేట్ ని ఇచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశారు మేకర్స్. ఎన్టీఆర్ 30.. మాసివ్ ప్రాజెక్ట్ ని అయితే వచ్చే ఏడాది అంటే 2024లో ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేసారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్ వేయిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆ పనిలోనే ఉన్నారు. ఆయన ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేసారు. దీంతో తాజాగా సహజత్వం ఉట్టిపడేలా నగరంలో సముద్రపు సెట్ వేస్తున్నారు. ఈ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి.

రెండు రోజుల కిందట సిరిల్ పుట్టిన రోజును కూడా సాబు ఈ సెట్ లోనే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రం షూటింగ్ ను ఘనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌తో పాటు రాజమౌళి కుటుంబం, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ఆహ్వానిస్తారని సమాచారం. కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

. @tarak9999’s #NTR30 Art department celebrated production desinger @SabuCyril’s Birthday ???? pic.twitter.com/LDupCrrqX3

— MovieZine (@MovieZineGlobal) January 27, 2023
ఎన్టీఆర్ 30 సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఎన్టీఆర్ కొరటాల ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.