Pavitra Lokesh: హాట్ టాపిక్‌గా పవిత్ర లోకేష్‌ తన భర్తపై పవిత్ర కామెంట్స్ విన్నారా..?

0

ప్రస్తుతం జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్ అవుతున్న విషయం సీనియర్ యాక్టర్ నరేష్ పెళ్లి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధం కావడం హాట్ టాపిక్ అయింది. నటి పవిత్ర లోకేష్‌తో ఆయన నడిపిస్తున్న ప్రేమాయణం పలు వివాదాలకు దారి తీస్తోంది. ఓ పక్క నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లికి రెడీ అన్నట్లు హింట్స్ ఇస్తుండగా.. మరోపక్క నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, నరేష్‌కి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇదే విషయమై కోర్టును ఆశ్రయించిన నరేష్.. రమ్యపై సంచలన కామెంట్స్ చేశారు. ఆమె నుంచి ప్రాణ భయం ఉందని అంటున్నారు నరేష్.

2010 మర్చి 3న రమ్యతో వివాహం జరిగిందని చెప్పిన నరేష్.. పైసా కట్నం కూడా తీసుకోలేదని అన్నారు. అయితే పెళ్ళైన కొన్ని నెలల నుంచే రమ్య నుంచి వేధింపులు మొదలయ్యాయని నరేష్ చెప్పారు. తనకు తెలియకుండానే తన పేరు చెప్పి కొందరు వ్యక్తులు, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుందని కోర్టుకు చెప్పారు నరేష్. రమ్య వల్ల నేను నరకయాతన అనుభవించా. సుపారీ గ్యాంగ్ తో కలిసి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తోంది. నాకు ప్రాణహాని ఉంది. చంపేస్తారనే భయంతో ఎక్కడికీ ఒంటరిగా వెళ్లడం లేదు అని నరేష్ అన్నారు.

ఇదిలాఉంటే మరోపక్క పవిత్ర లోకేష్‌కి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింటి తెగ చెక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఆమె.. తన భర్త సుచేంద్ర ప్రసాద్‌ గురించి గొప్పగా చెప్పిన మాటలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. అప్పట్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సుచేంద్ర ప్రసాద్‌ దేవుడు అన్నట్లుగా చెబుతూ ఆయనపై ప్రేమ కురిపించింది పవిత్ర లోకేష్. ఓ సీరియల్‌లో నటించే సమయంలో తమ మధ్య పుట్టిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం అని పవిత్ర చెప్పింది. మా ఆయన చాలా మంచి వ్యక్తి అని అప్పట్లో చెప్పింది పవిత్ర.

తన భర్త లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, ఆయనలో ఒక్క లోపం ఉండదని ఆ సమయంలో పవిత్ర చెప్పుకొచ్చింది. తన అభిప్రాయాలను ఆయన ఎంతో గౌరవిస్తారని.. తన విషయంలో ఆయన చాలా పొసేసివ్‌గా వ్యవహరిస్తారని ఆమె చెప్పింది. అయితే ఇప్పుడు నరేష్‌తో పవిత్ర లోకేష్ చెట్టాపట్టాలేసుకు తిరగడం ఆమెపై కాస్త నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తోంది. డబ్బు కోసమే నరేష్‌ వెంట పవిత్ర తిరుగుతోందని రమ్య రఘుపతి ఆరోపణలు గుప్పిస్తోంది.

నరేష్, పవిత్ర లోకేష్‌ను మైసూరు హోటల్‌ గదిలో ఉండగా.. నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి రచ్చ చేసింది రమ్య. అప్పటి నుంచి నరేష్ నాలుగో పెళ్లి అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.