Pawan Kalyan – Sujeeth: పవన్ కళ్యాణ్, సుజిత్ మూవీకి ముహూర్తం ఫిక్స్

0

Pawan Kalyan Sujeeth Movie: ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చేయనున్నాడు. దానికి సంబంధించిన అపీషియల్ ప్రకటన కూడా విడుదల చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు ఉదయం (30 జనవరి)న జరగనుంది. దానికి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ ‌తో సాహో తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్‌తో సుజిత్ చేయబోయే సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాను కేవలం పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో ఈ సినిమాను ప్లాన్ చేసారట దర్శకనిర్మాతలు.

అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్, భీమ్లానాయక్ రూపంలో మళ్ళీ సెట్స్ మీదకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. లైన్‌లో బడా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ సెట్స్ మీద బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాక సంబంధించిన షూటంగ్‌ త్వరలో పూర్తి కానుంది. మార్చి 31న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ డేట్‌లో వస్తుందో రాదో చూడాలి.

ఇక హరి హరవీరమల్లు తర్వాత ర‌న్ రాజా ర‌న్‌, సాహో చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను బయటపెట్టిన యువ దర్శకుడు సుజీత్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. స్టైలిష్ మేకోవర్ తో సినిమాలు చేయడంలో దిట్ట అయిన సుజిత్, పవన్ కోసం ఓ బలమైన కమర్షియల్ యాంగిల్ స్టోరీ సిద్ధం చేసుకున్నారని టాక్.
RRR వంటి సెన్సేష‌న‌ల్ మూవీని నిర్మించి దేశవిదేశాల్లో క్రెడిట్ కొట్టేసిన DVV ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను సర్వ హంగులతో రూపొందించనున్నారట. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం రూ. 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య.

అయితే ఈ సినిమా మరే సినిమాకు రీమేక్ కాదని సమాచారం. ఓ ఫ్రెష్ సబ్జెక్ట్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ప్లాన్ చేశారట సుజీత్. దీంతో ఈ కొత్త సినిమా ప్రకటనతోనే మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ గుడ్ న్యూస్ విని పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఈయన బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్‌ 2లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. బాలయ్యతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా రానుంది. ఈ క్రమంలోనే సుజీత్ తో సినిమాను లైన్ లోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా కమిటై ఉన్నారు. సో దీన్నిబట్టి ఈ మూడు సినిమాలను చకచకా కంప్లీట్ చేసి 2024 ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం పూర్తిగా తన సమయం కేటాయించాలనే ప్లాన్‌లో ఉన్నారు పవర్ స్టార్ అలియాస్ జనసేనాని.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.