మరో సూపర్ సినిమాను ఇచ్చేనా?

0

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ పరంగా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాను చేస్తున్న నాగార్జున ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక విభిన్నమైన స్టోరీతో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సమయంలోనే ఈయన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కు కూడా ఓకే చెప్పాడట. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు మాత్రం జరుగుతున్నాయి.

నాగర్జున మరియు పూరిల కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. 2003లో శివమణి రాగా 2005 సంవత్సరంలో సూపర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలు మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కాంబో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే పూరితో మూవీ చేసే అవకాశం ఉందంటున్నారు. త్వరలో అందుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో పూరి కూడా ఫైటర్ తో పాటు మరో సినిమాను కూడా పూర్తి చేస్తాడని అంటున్నారు. వైవిధ్య భరితమైన కథలను రూపొందిచే ఘటికుడు పూరి. ఆయన ఈ లాక్ డౌన్ లో చిరంజీవి కోసం కూడా కథను రాస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా ఇప్పుడు నాగ్ పూరి మూవీల చర్చలు జరుగుతున్నాయంటున్నారు. నాగ్ తో సినిమా చేసిన తర్వాత చిరుతో పూరి చేస్తాడేమో చూడాలి.