మహేష్ నెవర్ బిఫోర్ మీసం లుక్ పై సతీమణి కామెంట్..!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవుతున్నాడు. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అంటూ నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఆన్ స్క్రీన్ – ఆఫ్ స్క్రీన్ ఒకే విధంగా ఎప్పుడూ క్లీన్ షేవ్ తో లైట్ గా మీసాలతో కనిపిస్తుంటాడు మహేష్. ఫస్ట్ సినిమా నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు ఇలానే మైంటైన్ చేస్తూ వచ్చాడు. హెయిర్ స్టైల్ లో వేరియేషన్ చూపించినప్పటికీ గడ్డం మీసాలలో పెద్దగా చేంజ్ చూపించలేదు. కాకపోతే ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ సినిమాల్లోని సాంగ్స్ లో పెట్టుడు మీసంతో కనిపించి అభిమానులను అలరించాడు. ఇప్పుడు మరోసారి ఓ యాడ్ షూట్ కోసం మహేష్ బాబు మీసకట్టుతో దర్శనమిచ్చాడు.

ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ కమర్షియల్ యాడ్ కోసం మహేష్ మీసాలతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది మహేష్ సతీమణి నమ్రత. ఈ ఫొటోలో పంచెకట్టులో ఉన్న మహేష్ కు మేకప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ లుక్ గురించి నమ్రత ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెడుతూ ”కృత్రిమంగా అమర్చేది (ఈ సందర్భంలో మీసం) ఎప్పుడూ వాస్తవికంగా కనిపించదు. వాటితో షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు కచ్చితంగా సౌకర్యవంతంగా లేదా సరదాగా ఉండదు. అయితే తమ వైపు నిపుణులు ఉన్నప్పుడు సవాళ్లను ఇష్టపడనిదెవరు” అని పేర్కొన్నారు. ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ కి ఫిదా అవుతున్నారు.

కాగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.