డిటెక్టివ్ నందమూరి.. సరికొత్త సినిమాలో కల్యాణ్ రామ్!

0

సినిమా నిర్మాణంలో వెనకడుగు వేయడమనేదే ఉండదు.. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు.. అయినా కానీ కల్యాణ్ రామ్ కెరీర్ ఇంకా స్ట్రగుల్స్ అధిగమించలేకపోతోంది. ఒక హిట్ వస్తే.. వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. పలు అపజయాల తర్వాత 118 సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన నందమూరి హీరో.. గతేడాది వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో మళ్లీ పట్టాలు తప్పాడు. దీంతో ఏడాది కాలంగా సినిమా అనౌన్స్ మెంటే లేదు.

మలయాళ థ్రిల్లర్ ‘అంజామ్ పత్తిర’ రీమేక్లో నటించబోతున్నాడని ప్రచారం సాగినప్పటికీ.. ఏమైందో తెలీదు. ఇది కాకుండా.. మరికొన్ని కథలు విన్నప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే.. లేటెస్ట్ గా ఓ అప్డేట్ వినిపిస్తోంది. దీని ప్రకారం.. డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడట కల్యాణ్ రామ్.

‘ఏజెంట్ వినోద్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అవసరాల శ్రీనివాస్ హీరోగా ‘బాబు బాగా బిజీ’ అనే నాన్ వెజ్ కామెడీ మూవీని డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం.. ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ‘బాబు బాగా బిజీ’ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే.. అది రీమేక్ కావడంతో.. దర్శకుడిని పూర్తిగా నిందించడానికి లేదు.

ఈ క్రమంలోనే సూపర్బ్ థ్రిల్లర్ స్టోరీతో కల్యాణ్ రామ్ను ఇంప్రెస్ చేశాడట నవీన్. దీంతో.. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ ఓకే చెప్పాడని సొంత బేనర్లోనే నిర్మించబోతున్నారని సమాచారం. 1940 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందట. బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో.. కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.