‘వీరమల్లు’ పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్..! ఎంతో తెలుసా?

0

పవర్స్టార్ పవన్కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు.

అయితే.. పవన్ రీ-ఎంట్రీలో అనౌన్స్ చేసిన నాలుగు సినిమాల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. దీంతో.. అప్పటి మనిషిగా పవన్ ఎలా కనిపిస్తారు? ఆయన గెటప్ ఎలా డిజైన్ చేస్తున్నారు? ఏ టైటిల్ ఖరారు చేయబోతున్నారు? వంటి అంశాలు ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అయితే.. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్.. అద్భుతమైన రూపాన్ని ఫైనల్ చేశాడట. అంతేకాదు.. ఈ గెటప్ పవన్ కు పర్ఫెక్ట్ గా సరిపోయిందని తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించలేని విధంగా.. అటు పీరియాడిక్ ఫిల్మ్కి తగ్గట్టుగా ఉండడమే కాకుండా.. చూడగానే ఒక వీరుడిని తలపించే రూపాన్ని సిద్ధం చేశాడట క్రిష్.

కాగా.. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతోందట. దాదాపు 170 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. మొఘల్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాలంటే పక్కాగా సెట్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. మనుషుల వేషధారణ మొత్తం భిన్నంగా ఉండబోతోంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించబోతున్నారు. దీంతో.. ఇతర భాషలకు చెందిన యాక్టర్స్ ను కూడా తీసుకోబోతున్నాడు క్రిష్. ఈ చిత్రంలో పవన్ సరసన.. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. అదేవిధంగా.. పవన్ ను ప్రేమించే ఓ గిరిజన యువతి క్యారెక్టర్ కోసం ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోనున్నారని సమాచారం.

ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఈ భారీ బడ్జెట్ చిత్రం నిర్మిస్తున్నారు. పవన్ తో గతంలో బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషీ’ నిర్మించింది కూడా ఈ నిర్మాతే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని యోచిస్తోంది యూనిట్.