‘మా వింత గాధ వినుమా’ టీజర్..!

0

సిద్ధు జొన్నలగడ్డ – శీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్ ఎంటర్టైనర్ ”మా వింత గాధ వినుమా”. ఆదిత్య మండల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ – ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్ – మెలోడ్రామా స్టూడియోస్ పతాకాలపై సంజయ్ రెడ్డి – అనిల్ పల్లాల – జి. సునీత – కీర్తి చిలుకూరి నిర్మించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా ”మా వింత గాధ వినుమా” టీజర్ ని నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు.

”ఈ సినిమాలా హీరోగాని పేరు సిద్ధూ.. నెంబర్ వన్ హవలాగాడు.. వీడి రుబాబంతా దోస్తుల మీద.. హోటళ్లలో వైటర్ల మీద.. లేడీస్ హాస్టళ్లలో వాచ్ మెన్ ల మీద..” అంటూ హీరో సిద్ధు తెలంగాణా స్లాంగ్ వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అయింది. ‘ఇక మనోడు కాలేజీలో ఓ పిల్లకి లైటింగ్ కొట్టిండు.. ఆ పిల్లకి మనోడు చాకోలెట్ ఇచ్చిండు.. ఆ పిల్ల మనోడికి బిస్కెట్..’ సాగిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకముందు సిద్ధు – శీరత్ కపూర్ జంటగా తెరకెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తరహాలోనే నేటితరం యువతీ యువకులకు కనెక్ట్ అయ్యే సినిమాలాగే అనిపిస్తోంది.

”మా వింత గాధ వినుమా” చిత్రానికి హీరో సిద్ధు జొన్నలగడ్డ రచనా సహకారం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మరియు రోహిత్ రాయ్ సంగీతం అందించారు. సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రాఫర్ గా.. వంశీ అట్లూరి ఎడిటర్ గా వర్క్ చేసారు. ఇక ఈ చిత్రంలో తనికెళ్ల భరణి – ప్రగతి – మంచు లక్ష్మి – శిశిర్ శర్మ – జయప్రకాశ్ – రాజేశ్వరి నాయర్ – కమల్ కామరాజు – కల్పిక గణేశ్ – వైవా హర్ష – ఫిష్ వెంకట్ – సీవీఎల్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్ 13న ‘ఆహా’ లో విడుదల చేస్తున్నారు.