Templates by BIGtheme NET
Home >> Cinema News >> 25Yrs డబూ రత్నానీ క్యాలెండర్ పంట పండించాడు

25Yrs డబూ రత్నానీ క్యాలెండర్ పంట పండించాడు


బాలీవుడ్ ఏస్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని పరిచయం అవసరం లేదు. యేటేటా ప్రసిద్ధ క్యాలెండర్ ఫోటో షూట్ తో ఆయనకు వరల్డ్ వైడ్ పాపులారిటీ పెరిగింది. బాలీవుడ్ పరిశ్రమలో ఎందరు అందగత్తెలు ఉన్నా ఆయన లెన్స్ కిందికి రావాల్సిందే. అతడు సోషల్ మీడియా యూజర్ గానూ వైరల్. డబ్బూ తన ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్టుగా శ్రద్ధా కపూర్ – సన్నీ లియోన్ – విద్యాబాలన్ సహా పలువురు స్టార్ల ఫోటోల్ని షేర్ చేశారు.

25 సంవత్సరాల డబ్బూ రత్నాని క్యాలెండర్ వర్ణరంజితం అయ్యిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ అద్భుతమైన బ్యాక్లెస్ ఫోటోషూట్ ను పోస్ట్ చేయగా అది అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అలాగే బాలన్ ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ గా కనిపిస్తూ వేడి పెంచింది. సన్నీలియోన్ క్లాసీ ఎక్స్ ప్లోజివ్ లుక్ అంతే స్పెషల్ గా ఆకట్టుకుంది ఈ క్యాలెండర్ లో.

డబ్బూ తన క్యాలెండర్ షూట్లో అనేక మంది ఎ-లిస్టర్ లతో పాటు కొత్తవారికి అవకాశం ఉంటుంది. అమితాబ్ బచ్చన్- షారూఖ్ ఖాన్- ప్రియాంక చోప్రా- ఐశ్వర్య రాయ్ నుండి సన్నీ లియోన్- కియారా అద్వానీ- అలియా భట్- రణబీర్ కపూర్ – అందరూ ఆయన క్యాలెండర్ ను అలంకరించారు. షారూఖ్ ఖాన్ నటించిన సినిమాల స్టిల్స్ లో ఫోటోషూట్ ల సిరీస్ ను పోస్ట్ చేశారు. క్రియేటివిటీ తో ఆలోచించే మైండ్.. ఐ విజువల్ వ్యూ రెండిటికీ పదును పెట్టే ఫోటోగ్రాఫర్ గా డబూ రత్నానీ పాపులారిటీ ఏ పాటిదో ఈ క్యాలెండర్ గాళ్స్ ని చూసి మీరే నిర్ణయించవచ్చు.