కాజల్ పెళ్లి: గుంపుగా బ్యాచిలర్ పార్టీలో కుమ్మి పడేశారు

0

అందాల కుందనపు బొమ్మ కాజల్ పెళ్లి కూతురైంది. కొద్ది సేపటి క్రితమే నవ వధువు ఫోటో రిలీజై అంతర్జాలాన్ని షేక్ చేసింది. ఇంకా ఆ ఫోటో గురించే అభిమానులు డిస్కషన్లు పెట్టుకుంటే ఈలోగానే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ నుంచి ఒక్కో హాట్ ఫోటోని షేర్ చేస్తూ కాజల్ టీమ్ హడావుడి చేసేస్తోంది.

ఇదిగో పెళ్లంటే ఊరికే ఉంటారా బ్యాచిలర్ టీమ్. పైగా ముంబై బ్యూటీ కాజల్ కి ఫ్రెండ్ సర్కిల్ చిన్నదేమీ కాదు. బ్యాచిలరొట్టే పార్టీలంటే తెగ మక్కువతో ఉంటారు. ఆ మాత్రం నిషా ఎక్కాక కిక్కు ఎక్కాక చిందులేస్తూ ఎంజాయ్ చేయకపోతే మనసు నిలవదు మరి. గుండె లబలబా కొట్టేసుకుంటుంది. ఇదిగో ఇక్కడ సీన్ చూస్తుంటే అలానే ఉంది మరి. బ్యాచిలర్ పార్టీలో భామలంతా ఫుల్ చిలౌట్ చేస్తున్నారు. బ్రైడ్ అన్న నేమ్ తో ఉన్న మెరూన్ రెడ్ డిజైనర్ ఫార్మల్ లో కాజల్ ఫుల్ గా ట్రీటిచ్చింది మరి.

ఈ రోజు ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో కాబల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడేస్తోంది. కాజల్ తన వివాహానికి పూర్వపు ఫంక్షన్ల నుండి ఫోటోలను పంచుకుంటూ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు మరి. కాజల్ అగర్వాల్ తన పెళ్లికి ముందే తన మెహెండి ఫంక్షన్ నుండి అద్భుతమైన ఫోటోను పంచుకున్నారు. ఇటీవల కాజల్ కి అంకితమైన అభిమాని క్లబ్ ఆమె పైజామా పార్టీ నుండి వరుస ఫోటోలను పంచుకుంది. ఈ చిత్రాలలో కాజల్ తన అమ్మాయి ముఠాతో గాలా టైమ్ ఎంజాయ్ ఏస్తోంది. కాజల్ అగర్వాల్ తన ముంబై ఇంటిలో నిర్వహించిన హల్ది వేడుక నుండి కూడా అద్భుతమైన చిత్రాన్ని పోస్ట్ చేసింది.