కాజల్ పెళ్లి సందర్భంగా ‘మోసగాళ్లు’ టీమ్ స్పెషల్ విషెస్..!

0

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”మోసగాళ్లు”. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మోసగాళ్లు’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో విష్ణు సోదరి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నేడు కాజల్ అగర్వాల్ వివాహం ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో జరగనుంది. ఈ సందర్భంగా ‘మోసగాళ్లు’ టీమ్ చందమామ కాజల్ అగర్వాల్ కు విషెస్ తెలియజేస్తూ న్యూ పోస్టర్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించిన కాజల్ ఠీవీగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ‘మోసగాళ్లు’ చిత్రాన్ని ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు – ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళం మలయాళం కన్నడ మరియు హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ – నవదీప్ – నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం. ఈ సినిమా స్టోరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెంకీ వివరిస్తారని తెలుస్తోంది.