నారా రోహిత్ సర్ ప్రైజ్ లుక్.. ఈసారి కసిగా కొట్టాలని..!!

0

యంగ్ ట్యాలెంటెడ్ హీరో నారా రోహిత్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. గత కొన్ని పరాజయాలతో విసిగిపోయిన రోహిత్ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఎంతగా అంటే.. అసలు రోహిత్ ఎక్కడ? ఏం చేస్తున్నాడు? అన్నది మర్చిపోయే పరిస్థితి. అయితే ఇలా ఎందుకయ్యింది? అన్నది అతడు విశ్లేషించుకున్నట్టే కనిపిస్తోంది. నిజానికి నారా హీరోలో ప్రతిభకు కొదవేమీ లేదు. ఆరంగేట్రమే అదరగొట్టాడు. `బాణం` సినిమాతో ప్రత్యేక ఇంప్రెషన్ ని క్రియేట్ చేసిన నారా రోహిత్ వరుసగా ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ పాత్రలతో మెప్పించాడు. అయితే సక్సెస్ ని ప్రయోగం డామినేట్ చేసింది. విజయాల్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక ఏదో కొత్త గా ప్రయత్నించాను అనుకున్న మల్టీస్టారర్లు కూడా రోహిత్ కి కలిసి రాలేదు. శ్రీవిష్ణుతో కలిసి నారా రోహిత్ నటించిన చిత్రం `వీరభోగ వసంతరాయలు`.. ఆ తర్వాత మరో మల్టీస్టారర్ `శమంతకమణి` సినిమాల రిజల్ట్ కూడా నిరాశపరిచింది. ఆ తరువాత నారా రోహిత్ నటించిన చిత్రమేదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అతన్ని మరిచారా అనుకుంటున్న వేళ నారా రోహిత్ న్యూ లుక్ తో ప్రత్యక్షమై షాకిచ్చాడు.

పూర్తిగా స్లిమ్ గా మారి సర్ ప్రైజ్ చేశాడు. ఈ సారి మరింత కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలన్న పట్టుదల కసితో నారా రోహిత్ వున్నట్టు కనిపిస్తోంది. అధికబరువును తగ్గించి స్మార్ట్ లుక్ కి మారాడు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రంతో తనని తాను రీలాంచ్ చేసుకునేందుకు రోహిత్ తహతహలాడుతున్నాడట. ఇక తాజాగా గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించడం చూస్తుంటే ఏదో గట్టిగానే కొట్టాలన్న పంతం కనిపిస్తోంది. ఈ ఫిట్ లుక్ కోసం నారా రోహిత్ సుశిక్షితుడైన ఫిజికల్ ఫిట్ నెస్ ట్రైనర్ సహాయంతో సరికొత్త రూపంలోకి మారిపోయాడు. దీని కోసం కఠినమైన వ్యాయామ నిబంధనల్ని.. డైట్ ని పాటించాడట. లేటెస్ట్ లుక్ చూడగానే సింహపురి సింహంలా సింగరాయ్ లా ఏమిటిది నారా! అని ప్రశ్నిస్తోంది యూత్. పుష్పలో విజయ్ సేతుపతి పాత్రను రీప్లేస్ చేస్తున్నారు. ఆ గెటప్ ఇదేనా? అని ప్రశ్నించాడో అభిమాని. దీనికి రోహిత్ నుంచి సమాధానం రావాల్సి ఉంది.

ట్యాలెంటెడ్ రోహిత్ ఈసారి రీలాంచ్ లో అయినా అభిమానులు ఆశించినట్టు దూసుకొస్తాడా? ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ లో వరుస షూటింగ్ లు జరుగుతున్నాయి. రోహిత్ కూడా తన కొత్త సినిమాని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ దఫా అయినా కెరీర్ జెట్ స్పీడ్ తో టేకాఫ్ అవుతుందేమో చూడాలి.