మాజీ మిస్ ఇండియా ‘సిస్టర్’కి కరోనా పాజిటివ్.. స్వయంగా వెల్లడి!!

0

ఇటీవలే మాజీ మిస్ ఇండియా వరల్డ్ బాలీవుడ్ నటి నటాషా సూరికి కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ఆ విషయం కూడా తానే స్వయంగా ప్రకటించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను ఆగస్టు ప్రారంభం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. అందుకే ఇన్నిరోజులుగా ఇంట్లోనే ఉండిపోయాను. అనుకోకుండా అత్యవసర పనిమీద ఆగస్టు 1న పూణె వెళ్లాను. కానీ నాతో పాటు సోదరి రూపాలి మా బామ్మ కూడా ఉన్నారు. వారు కూడా అనార్యోంగానే ఉన్నారు. ప్రస్తుతం మేమంతా మెల్లగా కోలుకుంటున్నాం” అని తెలిపింది నటాషా. అయితే తాజాగా నటాషా చెల్లి రూపాలికి కూడా కరోనా పాజిటివ్ తేలిందట. ఈ విషయం స్వయంగా తానే తెలియజేసింది రూపాలి. సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఫోటో పోస్ట్ చేసి.. “నాకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. గత కొద్ది రోజులుగా నాకు జ్వరం ముక్కు సమస్యతో పాటు గొంతు సమస్య అలాగే నాలుక రుచి కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంది.

అయినా కూడా నేను బ్రీతింగ్ ఎక్సరసైస్ యోగ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నన్ను నేను ఉత్సాహంగా.. బలంగా ఉండటానికి చేస్తున్నాను. కోవిద్ మనలను చాలా డిస్టర్బ్ చేస్తుంది. కానీ పాజిటివ్ మైండ్ తో కోవిద్ ను ప్రారంభ దశలోనే జయించవచ్చు అనేది నమ్ముతున్నట్లు” రూపాలి తన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో సినీ అభిమానులలో కాస్త కంగారు మొదలయింది. ఎందుకంటే మొన్నటి వరకు బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ.. అలాగే మరికొందరు కరోనా చికిత్స పొందుతున్నారు. ఇక ఇదిలా ఉండగా రూపాలి ఆగష్టు 1న తన అక్క నటాషాతో కలిసి బయటికి వెళ్లిందట. వీరితో పాటు వాళ్ల భామ కూడా ఉందని నటాషా తెలిపింది. మరి అక్కాచెల్లెళ్లు కరోనా బారిన పడ్డట్లే. మరి వారి భామను కూడా టెస్ట్ చేయించి త్వరపడితే బాగుంటుందని నెటిజన్లు సలహాలు అందిస్తున్నారు. ఇక నటాషా ఇటీవలే డేంజరస్ అనే సినిమాలో నటించింది.