బాలీవుడ్ నయా ప్రయోగం.. ‘మేల్ ప్రెగ్నెన్సీ’ పై సినిమా..!!

0

సినీ ఇండస్ట్రీలో రోజురోజుకి మార్పులు ఎలా వస్తున్నాయో.. అదేవిధంగా సినిమాల యొక్క కథ కథనాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా దానికదే కొత్త మార్పులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇదివరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి.. జనాలు కూడా అవే ఆదరించేవారు. ఆ తర్వాత లవ్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. వాటిని కూడా జనాలు చూస్తూ వచ్చారు. అయితే ప్రతీ ఇండస్ట్రీలో కామన్ గా వస్తున్న సినిమాలు మాత్రం ప్రయోగాత్మక సినిమాలు. ఇదివరకు సౌత్ ఇండస్ట్రీలలో అంటే తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇండస్ట్రీలలో.. ఫ్యామిలీ కామెడీ హారర్ సినిమాలు బాగానే వచ్చేవి. కానీ ఇప్పుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా.. ఇండస్ట్రీలలో బోల్డ్ కంటెంట్ బోల్డ్ మూవీస్ వెబ్ సిరీస్ రావడం మొదలైంది. అలాంటి కంటెంట్ అందించడంలో మొదటి నుండి ముందే ఉంది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా మేకర్స్ వెనుకాడరు.

బాలీవుడ్ జనాలు బోల్డ్ కంటెంట్ ఆదరిస్తారు. ఇటు ఫ్యామిలీ కంటెంట్ ఆదరిస్తారు. అలాంటప్పుడు ప్రయోగాలు చేసేవారికి ఎలాంటి అడ్డు లేనట్లే కదా! ఇక ఆడవారి ప్రెగ్నెన్సీ గురించి సినిమాలు రూపొందించిన బాలీవుడ్ మేకర్స్ త్వరలో ‘మేల్ ప్రెగ్నెన్సీ’ అంటే మగవారు గర్భం దాల్చడం పై సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జనాలలో కూడా ఆసక్తి మొదలైంది. అయితే ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారట. సూర్మలో ప్రధాన పాత్ర పోషించిన దిల్జీత్ సింగ్.. ఈ మూవీలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరగుతున్నాయట. ఇదివరకు ఇలాంటి కాన్సెప్ట్ పంజాబీలో కనిపించినా దానికి దీనికి ఎలాంటి పోలిక లేదని అంటున్నారు. చూడాలి మరి మేల్ ప్రెగ్నెన్సీ మూవీ ఎలా ఉండబోతుందో..!