అయ్యప్పనుమ్ రీమేక్ స్టార్స్ కన్ఫర్మ్

0

మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కౌషియుమ్ చిత్రం ను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ రీమేక్ ను చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రైట్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగు రీమేక్ గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమద్య రానా మరియు బాలకృష్ణల కాంబోలో ఈ రీమేక్ తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని వారు ఇంకా ఓకే చెప్పలేదని ఆ తర్వాత తేలింది.

గత ఆరు నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే త్రివిక్రమ్ చెంతకు ఈ రీమేక్ వెళ్లిందని ఆయన స్క్రిప్ట్ ను పూర్తి చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. టాలీవుడ్ అయ్యప్పనుమ్ ఇంకా చర్చలు జరుగుతున్న సమయంలో తమిళ రీమేక్ కు సంబంధించి నటీనటులు కన్ఫర్మ్ అయ్యారు.

ఒరిజినల్ వర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ మరియు బిజు మీనన్ లు నటించారు. తమిళంలో ఆ పాత్రలను శింబు మరియు రాధకృష్ణన్ ప్రతిభన్ లు పోషించబోతున్నారు. కరోనా కారణంగా షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. కనుక ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరో వైపు హిందీ రీమేక్ కు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నాయి. కాని టాలీవుడ్ లో మాత్రం ఈ రీమేక్ రైట్స్ కు సంబంధించిన ఎటువంటి అప్ డేట్ కనిపించడం లేదు. మల్టీస్టారర్ సినిమా అవ్వడంతో టాలీవుడ్ స్టార్స్ వెనుక ముందు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ను నిర్మాత నాగవంశీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. కనుక ఆయన కాస్త ఆలస్యం అయినా ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.