Templates by BIGtheme NET
Home >> Cinema News >> అంధురాలిగా నటిస్తున్న స్టార్ హీరోయిన్…!

అంధురాలిగా నటిస్తున్న స్టార్ హీరోయిన్…!


Nayanatara playing blind in her next

సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ బ్యూటీ నయనతార.. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తరగని అందంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. స్టార్ట్ హీరోలందరి సరసన నటించిన నయన్.. ఎలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అయినా అవలీలగా యాక్ట్ చేసేస్తుంది అనే గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమెకు ఇప్పటికి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం నయనతార ‘నేత్రికాన్’ ‘మూకుతి అమ్మన్’ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ సినిమాలోనూ కనిపించనుంది. వీటితో పాటు ‘కాతువాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించనుంది.

ఇదిలా ఉండగా ‘కాతువాకుల రెండు కాదల్’ మూవీలో నయన్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా (బ్లైండ్) నటించనుందట. ఇంతకముందు తన ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘నేను రౌడీనే’ సినిమాలో హియరింగ్ ప్రాబ్లెమ్ (చెవుడు) ఉన్న అమ్మాయిగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ తన లవర్ కోసం నయన్ అంగవైకల్యం ఉన్న పాత్రలో కనిపించడానికి రెడీ అయిందట. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి గుర్తింపుని తెచ్చిపెడుతుందో చూడాలి. మొత్తం మీద గతేడాది ఏడు చిత్రాల్లో నటించిన నయనతార.. ఈ ఏడాది అరడజను ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టింది. సినీ కెరీర్ స్టార్ట్ చేసి 17 ఏళ్ళవుతున్నా ఇప్పటికి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇక తెలుగులో గతేడాది మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించిన నయన్.. రాబోయే రోజుల్లో డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.