డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ కు సమన్లు జారీ…?

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్లతో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్సీబీ అధికారుల విచారణలో రియా చక్రవర్తి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారికి సమన్లు జారీ చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా రియా వెల్లడించిన పేర్లలో బాలీవుడ్ హీరోయిన్లు మరియు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వీరందరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. వారిలో ముందుగా ఫ్యాషన్ డిజైనర్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేయనున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.