గర్భిణీ స్త్రీలు కదలకూడదని.. మెట్లు ఎక్కడం నిషేధమని.. నీళ్ల బిందె ఎత్తకూడదని పెద్దలు చాలా చెబుతుంటారు. కానీ అలాంటి వాళ్లను పాతకాలం అమ్మమ్మలు అంటూ తీసిపారేస్తూ నేటితరం గాళ్స్ జిమ్ముల్లో కసరత్తులు చేయడం చూస్తున్నదే. లేడీ రోబోట్ ఎమీజాక్సన్ అయితే బేబి బంప్ తో కేజీల కొద్దీ బరువైన డంబెల్స్ ఎత్తుతూ జాగింగ్ చేస్తూ కనిపించింది. గర్భంతో పలువురు కథానాయికల అండర్ వాటర్ ఫీట్స్ షాక్ కి గురి చేశాయి. లైవ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కొందరు భామలు తమ హార్డ్ హిట్టింగ్ యాటిట్యూడ్ ని బయటపెట్టారు గతంలో.
ఇప్పుడు విరుష్క జంట ప్రయోగాలు చూస్తుంటే అలాంటి సందేహమే కలుగుతోంది. గర్భిణీలు యోగా చేయడం మంచిదే. కానీ ఇలా తలకిందులుగా శీర్షాసనం ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే ఇది ఎంతటి దుస్సాహసమో అనిపిస్తోంది. అనుష్క శర్మ ఇటీవలే తన గర్భానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీపై వెటరన్ క్రికెటర్ గవాస్కర్ కొంటె కామెంట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఇక గర్భిణి అయిన తన సతీమణిని విడిచి కోహ్లీ ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితి. ఆట తో ఓవైపు బిజీ అయినా.. వీలున్నంతవరకూ ఇంటికే అంకితమవుతూ అనుష్క ఆలనా పాలనా చూడాలనుకుంటున్నారట. ఇటీవల ఆసీస్ టూర్ కి ముందు తనతో కలిసి జిమ్ యోగా చేస్తూ సమయం స్పెండ్ చేశారు.
తాజాగా భర్త విరాట్ కోహ్లీతో కలిసి యోగా చేస్తున్నప్పటి త్రోబాక్ ఫోటోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో విడుదల చేయగా అంతర్జాలంలో వైరల్ అయ్యింది. గర్భిణి అయిన భార్యకు విరాట్ శీర్షాసనం వేయడానికి సాయపడుతుండడం అందరినీ ఆకర్షించింది. అతడి సాయం ఎంతో గొప్పది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
తల్లి కాబోతున్న అనుష్క శర్మ తన బిడ్డ ఆరంగేట్రానికి ముందే ఇటీవల కొన్ని పనులను(ప్రకటనలు) ముగించుకుంటూ గత కొన్ని రోజులుగా ట్రెండీ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా అనుష్క నగరంలో పెండింగ్ షూట్లు పూర్తి చేస్తున్నప్పుడు.. విరాట్ కోహ్లీ తన టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు.
యోగాలో కోహ్లీ రక్షణ కల్పిస్తూ సహాయాన్ని అందించడం అందరినీ ఆకట్టుకుంది. అనుష్క తన యోగా గురువు అయిన భర్త సహాయం పర్యవేక్షణలో కష్టమైన యోగాసనం ప్రయత్నించానని వెల్లడించారు. ఈ అందమైన ఫోటో ని తన తల్లిదండ్రులకు అనుష్క షేర్ చేసింది. యోగా నా జీవితంలో ఒక పెద్ద భాగం కాబట్టి నేను అలాంటివన్నీ చేయగలనని నా డాక్టర్ సిఫారసు చేసారు.. నేను గర్భవతిగా ఉండటానికి ముందు నేను చేస్తున్న ఆసనాలు అన్నీ అటూ ఇటూ తిరిగేవి పూర్తిగా ముందుకు వంగి ఉండేవి చేసేదానిని.
కానీ ఇప్పుడు సులువైన అసనాలే వేస్తున్నాను. అయితే తగిన సపోర్ట్ తీసుకునే చేస్తున్నాను. నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న శిర్శాసన కోసం గోడ సాయం తీసుకున్నాను. సమర్థుడైన నా భర్త అదనపు సమతుల్యతతో ఉండటానికి నాకు సహకరించారు. నా యోగా గురువు పర్యవేక్షణలో ఇదంతా. ఈ సెషన్ లో ఆయన నాతో వాస్తవంగా ఉన్నారు. గర్భం తో ఇలా అభ్యాసాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది“ అని అనుష్క వెల్లడించారు.
ప్రస్తుతం అనుష్క ఇంట్లో సమయం గడుపుతుండగా విరాట్ ఆస్ట్రేలియాలో ఇండియా తరఫున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత త్వరలోనే ఆయన భారతదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు. అతను బిసిసిఐ నుండి కాబోయే డాడ్ గా సెలవు తీసుకున్నారు. అనుష్క బిడ్డకు జన్మనిచ్చేప్పుడు ఆ `అందమైన క్షణం` కోసం అక్కడ ఉండాలని తాను కోరుకుంటున్నానని విరాట్ ఈ సందర్భంగా చెప్పారు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
