బాలీవుడ్ లో ప్రేమ జంటల దాగుడు మూతల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. సింగిల్ అంటూనే జంటగా ప్రత్యక్షమవుతుంటారు. జంటగా ఒకే కార్ లో కలిసి ఈవెంట్లకు విచ్చేస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్లకు ఎటెండవుతారు. విదేశీ విహారాలకు కలిసే చెక్కేస్తుంటారు. కలిసి వచ్చి సింగిల్ గా రిటర్నులో వెళతారు. ఏం చేసినా ఈ కలరింగ్ చూసి ఇది ప్రేమాయణమే అని ఆడియెన్ ఫిక్సయిపోతుంటారు.
ఈ తరహా ప్రేమ జంటలపై ఠాంఠాం మోగిస్తూ నిరంతరం ముంబై మీడియా టీఆర్పీల్ని గుంజుకుంటుంది. ఇటీవలి కాలంలో నూతన సంవత్సర వేడుకల కోసం జంట షికార్లు చేసిన నవజాత జంటలను బాలీవుడ్ మీడియా ఒక ఆట ఆడుకుంది. మాల్దీవులకు వెళ్లినా లేదా ముంబై ఔట్ స్కర్ట్స్ కి వెళ్లినా అక్కడ ఈ జంటల్ని వెంటాడి మరీ కథనాలు అల్లింది. ఇక విమానాశ్రయాల్లో కొలీగ్స్ జంటగా దొరికిపోయినా అస్సలు వదిలిపెట్టకుండా ఆ ఫోటోల్ని చూపిస్తూ మీడియా కథనాలు వేడెక్కించేశాయ్.
అలా ఇటీవల హాట్ టాపిక్ అయిన జంటల్ని పరిశీలిస్తే.. సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా అద్వానీ జంట.. ఇషాన్ ఖత్తర్- అనన్య పాండే జోడీ.. విక్కీ కౌశల్- కత్రిన కైఫ్ జంట.. ప్రముఖంగా బాలీవుడ్ కథనాల్లో హైలైట్ అయ్యారు. వీళ్లతో పాటే ఇప్పటికే విడిపోయి సోలోగా ఉన్నామని చెప్పుకుంటున్న దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ కలిసే విహార యాత్రకు వెళ్లడం చిలౌట్ చేయడం వేడెక్కించింది. ఇక విక్కీతో కత్రిన లవ్ గురించి దాగుడుమూతల దాపరికం గురించి తెలిసినదే. రకుల్ అయితే ఎప్పుడూ సిద్ధార్థ్ ని స్నేహితుడే అనేస్తుంటుంది. ఇక ఖలీ పీళీలో నటించినప్పటి నుంచి షాహిద్ సోదరుడు ఇషాన్ అస్సలు తనని వదిలి ఉండలేకపోతున్నాడు. తనకు బాడీ గార్డ్ లా ప్రొటెక్టర్ లా మారాడు. జంటలుగా వీళ్లు మాల్దీవుల్లో విహరించారు. మరికొన్ని జంటలు ఎగ్జోటిక్ లొకేషన్లలో సెలబ్రేషన్ ని ప్లాన్ చేసుకున్నారు.
మేం సోలోగానే ఉన్నాం! అన్న కలరింగ్ ఇస్తూ బాలీవుడ్ లవ్ పెయిర్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. అసలు వీళ్లది కేవలం స్నేహమేనా.. లేకపోతే నిండా ప్రేమలో ఉన్నారా? అన్న అర్థం కాని గందరగోళం అలానే ఉంది. కానీ జంటగా ఎక్కడైనా కనిపిస్తే.. ఇదిగో వీళ్లు ఓపెనప్ అయిపోయారు! అంటూ ఒకటే ముంబై మీడియా మాత్రం ఆగలేకపోతోంది. ప్రేమ నందనవనంలో విహరిస్తున్న ప్రేమపక్షులు అంటూ వరుస కథనాలతో హీటెక్కించేస్తోంది మీడియా. ఈసారి రాజస్థాన్ లోని రణతంబోర్ ఫారెస్ట్ లో విహారానికి వెళ్లిన ఆలియా-రణబీర్ జంటకు.. దీపిక-రణవీర్ జంటకు అంతే ప్రాముఖ్యతనిచ్చి బాలీవుడ్ మీడియా కథనాలు వైరల్ చేసింది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
